Chetana Uttej: ఘనంగా ఉత్తేజ్ కూతురు చేతన సీమంతం వేడుక… ఫోటోలు వైరల్..!

  • November 19, 2021 / 10:39 PM IST

టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ కూతురు చేతన అందరికీ సుపరిచితమే..! ‘బద్రి’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. అటు తర్వాత హీరోయిన్ గా కూడా ఓ సినిమా చేసింది. కానీ ఆమెకు ఆశించిన స్థాయి గుర్తింపు దక్కకపోవడంతో ప్రముఖ నటుడు రవిరాజాను ప్రేమ వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. ఇటీవల ఆమె బేబీ బంప్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసి తన తల్లి, ఉత్తేజ్ భార్య అయిన పద్మిని గారు మళ్ళీ పుడతారంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

ఇక తాజాగా చేతన సీమంతం వేడుక కూడా కొద్దిమంది బందు మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలను ఉత్తేజ్ చిన్నకూతురు పాట ఉత్తేజ్..తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.అతి త్వరలో మా హీరో లేదా హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. వేడుకలో సింగర్లు… గీతా మాధురి, శృతి, నటుడు తనీష్ వంటి వారు కూడా సందడి చేశారు.ఆ ఫోటోలని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus