మరీ ఇలా అయితే కష్టం గురూజీ

Advertisement

ఒక రచయితగా త్రివిక్రమ్ అంటే అభిమానించేవారికంటే ఒక దర్శకుడిగా ఆయన్ని ప్రేమించేవాళ్లు, ఆరాధించేవాళ్లు ఎక్కువ. అందుకే ముద్దుగా ఆయన్ని “గురూజీ” అని పిలుచుకొంటారు. పైగా ఆయన మన తెలుగు సూపర్ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబులకు ప్రాణ స్నేహితుడు కావడంతో ఇరువర్గాల అభిమానులు ఏమాత్రం సంకోచించకుండా త్రివిక్రమ్ ను ప్రేమిస్తారు. ఇక త్వరలో ఎన్టీయార్ ను డైరెక్ట్ చేయనుండడంతో నందమూరి అభిమానులు కూడా త్రివిక్రమ్ ను అభిమానించడం మొదలెట్టారు. కానీ.. ఇందరి ప్రేమను త్రివిక్రమ్ ఓన్ చేసుకోవడం, అభిమానులు ఆనందించేలా సదరు హీరోలను స్క్రీన్ పై ప్రెజంట్ చేయడంలో త్రివిక్రమ్ కు సాటి మరెవ్వరూ రాలేరు.

అయితే.. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ త్రివిక్రమ్ మాత్రం నిర్మాత రాధాకృష్ణను, పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్ర ఇరకాటంలో పెట్టేస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకొని, ట్రైలర్ కట్, రిలీజ్ డేట్, ప్రమోషన్స్ ఇలా అన్నీ విషయాల్లోనూ త్రివిక్రమ్ మాత్రమే డెసిషన్ మేకర్ గా వ్యవహరిస్తున్నాడట. దాంతో నిర్మాత చినబాబు కాస్త చినబుచ్చుకొన్నాడని టాక్. ఇక సినిమా రేపు విడుదలవుతున్నప్పటికీ.. సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్ తప్ప వేరే కంటెంట్ ఏమీ బయటకి వదలకపోవడంతో సినిమాపై క్రేజ్ పెరిగినా.. డిస్ట్రిబ్యూటర్స్ లాంగ్ రన్ కి కష్టమవుతుందని తమ బాధని వెళ్లగక్కినప్పటికీ త్రివిక్రమ్ పట్టించుకోకపోవడంతో చినబాబు కూడా చేసేదేమీ లేక మిన్నకుండిపోయాడట.
సినిమా పెద్ద హిట్ అయిపోయి చినబాబుకి దర్శకుడు త్రివిక్రమ్ పుణ్యమా అని కోట్ల రూపాయలు లాభం వస్తే పర్లేదు కానీ.. ఏమాత్రం తేడా కొట్టినా త్రివిక్రమ్ నిందలపాలు కావాల్సి వస్తుంది. అయితే.. సినిమా మీద ఇప్పటివరకూ ఇసుమంతైనా నెగిటివ్ టాక్ కానీ ఇప్పటివరకూ ప్రదర్శితమైన ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచి డివైడెడ్ టాక్ లేకపోవడంతో సినిమా సూపర్ హిట్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే.. సంక్రాంతికి విడుదలవుతున్న మరో మూడు చిత్రాలు “జై సింహా, గ్యాంగ్, రంగుల రాట్నం” సినిమా రిజల్ట్స్ ను బట్టి కలెక్షన్స్ మరియు లాంగ్ రన్ ఉంటుంది. చూద్దాం మరి ఇంకొద్ది గంటల్లో “అజ్ణాతవాసి” రిజల్ట్ ఎలాగూ తెలిసిపోతుంది కదా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus