సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న చిరు 151 మూవీ ప్రీ లుక్ పోస్టర్

  • March 18, 2017 / 02:01 PM IST

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమాతో పూర్వవైభవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మూవీ విజయం ఇచ్చిన ఉత్సాహంతో 151 సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ ఫిల్మ్ ని కూడా రామ్ చరణే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చెర్రీకి ధృవ వంటి సూపర్ హిట్ ఇచ్చిన స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి కే మెగాస్టార్ కొత్త సినిమా బాధ్యతలను అప్పగించారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయింది. దీనిని చదివిన చిరు చాలా  సంతృప్తి పడినట్లు సమాచారం. ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీకి చెందిన ప్రీ లుక్ అంటూ ఈ రోజు నెట్లో ఓ పోస్టర్ హల్ చల్ చేస్తోంది.

1840 నాటి పరిస్థుతలను ప్రతిబింబించేలా గొడ్డలి, టైటిల్‌ లోగోతో చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. మెగాస్టార్ అభిమానులు కూడా ఈ పోస్టర్ చూసి చాలా ఆనందపడుతున్నారు. అయితే ఈ పోస్టర్ ని ఎవరు డిజైన్ చేశారు? ఎవరు రిలీజ్ చేశారు? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై చిత్ర బృందం త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus