మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రం విషయంలో క్లారిటీ వచ్చింది. రాయలసీమకు చెందిన స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కనున్న మూవీలో చిరు నటించనున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి, పరుచూరి బ్రదర్స్ కలిసి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు చిరు గుర్రపు స్వారీ, కత్తి ఫైట్స్ శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రాజక్ట్ గురించి అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. నిన్న నిర్మాత రామ్ చరణ్ తేజ్ మెగాస్టార్ సినిమాపై మాట్లాడారు. ఆయన హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 26 రోజుల తొలి షెడ్యూల్ సోమవారంతో పూర్తయింది. ఈ సందర్భంగా పోలవరం ప్రాంతంలో రామ్‌చరణ్ మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకూ నాన్న చేయనటువంటి ఓ కొత్త పాత్రతో ఆయన 151వ చిత్రం తెరకెక్కుతుంది. అది ఆగస్టులో మొదలవుతుంది’’ అని అభిమానులకు చెప్పారు. దీంతో ఫ్యాన్స్ సంబర పడ్డారు. ఆగస్టు అంటే ఆ నెల 22న తేదీ చిరంజీవి పుట్టినరోజు ఉంది. అదే రోజు ఉయ్యాలవాడ షూటింగ్ మొదలవ్వచ్చని వారు అంచనా వేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.