కూతురి మాట కాదనలేని చిరు!

Advertisement

ఒక మ‌న‌సు సినిమాతో మెగా ఫ్యాన్స్‌ని బాగా నిరాశ ప‌రిచింది నిహారిక‌. ఈ సినిమాతో నిహారిక స్టార్ హీరోయిన్ల‌కు చ‌మ‌ట‌లు ప‌ట్టిస్తుంద‌నుకొంటే సీన్ రివ‌ర్స్ అయ్యింది. రెండో సినిమా విష‌యంలోనే ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్ప‌డింది. ఎట్ట‌కేల‌కు నిహారిక రెండో సినిమా ఫిక్స‌య్యింది.

హ్యీపీ జ‌ర్నీ అనే సినిమాని నిహారిక కోసం తెలుగులో రీమేక్ చేస్తున్నార‌ని, ఇందులో హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రాణె నిహారిక‌కు జోడీగా క‌నిపించ‌బోతున్నాడ‌ని టాక్‌. దాంతో పాటు నిహారిక మ‌రో సినిమాపై కూడా ఆశ‌లుపెట్టుకొంది. అదేచిరు 150వ చిత్రం. పెద‌నాన్న సినిమాలో తాను కూడా క‌నిపించాల‌ని ముచ్చ‌ట‌ప‌డుతోంద‌ట‌.

ఒక్క ఫ్రేమ‌లో అయినా స‌రే.. ఛాన్సివ్వండి అంటూ చిరుని తెగ బ‌తిమాలుకొంటోంద‌ట నిహారిక‌. త‌నంటే చిరూకీ ఇష్ట‌మే. అందుకే నిహారిక మాట కాద‌న‌లేక‌.. ఆ బాధ్య‌త‌ను వినాయ‌క్‌కి అప్ప‌గించాడ‌ట చిరు. సో..చిరు 150లో నిహారిక జాయిన్ అవ్వ‌డం ఖాయ‌మే అన్న‌మాట‌.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus