మెగా చిరంజీవి విద్యారంగంలోకి అడుగులు వేస్తున్నారని.. త్వరలోనే చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభమవుతున్నాయనే వార్తలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. సంస్థకు చిరంజీవి పేరు ఉండటం ఫౌండర్ పేరు శ్రీ చిరంజీవి, అధ్యక్షులుగా శ్రీ నాగబాబు పేరు ఉండటంతో అవి చిరంజీవి స్థాపించిన పాఠశాలలే అని, అవి మెగాస్టార్ ఆధ్వర్యంలోనే ఈ పాఠశాలలో నడుస్తున్నాయనే అభిప్రాయం కూడా బలపడింది. అయితే వార్తల్లో నిజం లేదని.. ఈరోజు సంస్థల సీఈవో జె.శ్రీనివాస్ రావు ఈ విషయం పై స్పందించి క్లారిటీ ఇచ్చాడు.
వారు స్పందిస్తూ.. ” చిరంజీవి అభిమానులం కావడం వలన ఆయన పేరుతో సంస్థను ఏర్పాటు చేశాము.మాకు మెగా కుటుంబం మీదున్న అభిమానంతో చిరంజీవి గారిని గౌరవ ఫౌండర్ పదవిలో, నాగబాబును గౌరవ అధ్యక్షుడి పదవిలో, రామ్ చరణ్‌ను గౌరవ చైర్మన్ పదవిలో నియమించుకున్నాం.. అంతేకానీ మెగా ఫ్యామిలీకి ఈ విద్యాసంస్థలకు ఎటువంటి సంబంధం లేదు”.. అంటూ వివరణ ఇచ్చాడు శ్రీనివాస్.