ఇప్పటివరకూ కొరటాల దర్శకత్వం వహించిన సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కినవే. “మిర్చి” మొదలుకొని “భరత్ అనే నేను” వరకూ ప్రతి సినిమా 50 కోట్ల పైన బడ్జెట్ తో రూపొందాయి. ఇప్పుడు కొరటాల తన ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించనున్న సినిమాను కూడా భారీ స్థాయిలో తెరకెక్కించనున్నాడు. తన ప్రతి సినిమాతో సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇచ్చే కొరటాల.. తన తాజా చిత్రంతో చిరంజీవికి “ఠాగూర్” లాంటి ఎవర్ గ్రీన్ హిట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. చిరంజీవి ఈ చిత్రంలో ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నారు.
ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించనుండగా.. ఈ సినిమాని దాదాపు 140 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు సన్నద్ధమవుతున్నారు నిర్మాతలు. “ఖైదీ నెం.150, సైరా” లాంటి సినిమాల కలెక్షన్స్ చూసిన తర్వాత చిరంజీవి మీద 200 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా నిర్మాతలు వెనకాడడం లేదు. అలాంటిది 140 కోట్ల బడ్జెట్ అంటే ఆల్రెడీ సేఫ్ ప్రొజెక్ట్ అనే చెప్పాలి. సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందంటే సునాయాసంగా 300 కోట్లు వసూలు చేయగల సత్తా, స్టామినా చిరంజీవికి ఉన్నాయి.
మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!