మెగాస్టార్ చిరంజీవి హీరోగా, డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, హీరో రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న సినిమా ‘సైరా’. స్వాత్యంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండగా భారీ తారాగణంతో, దాదాపుగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్న విషయం మనకి తెలిసిందే. ఇక ఈ సినిమా అవుట్ ఫుట్ విషయంలో చిరంజీవి ఈ మధ్య అసంతృప్తిగా ఉన్నాడనే పుకార్లు చెక్కర్లుకొడుతున్నాయి.
ఇక విషయంలోకి వెళితే, ‘సైరా’ సినిమాకు ప్రొడ్యూసర్ గా మొదటి నుండి కూడా అన్ని తానే దగ్గరి ఉండి నిర్మాణ బాధ్యతలను చూసుకున్న రామ్ చరణ్ ‘వినయ విధేయ రామా’ సినిమాలో కాస్త బిజీగా ఉండటంతో ఆ బాధ్యతలని చిరంజీవి గారు తీసుకున్నారట. అయితే సినిమా నిర్మాణ పనుల్లో జరుగుతున్న పొరపాట్ల వలన చిరంజీవి షూటింగ్ స్పాట్ లోనే సిబ్బందిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడట. ఒక సందర్భంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి పైన కూడా చిరంజీవి కోపడ్డారనే వార్త వినిపిస్తుంది. ఇలా నిర్మాణ పనులు, ఇటు నటన రెండు ఒకేసారి చూసుకోవాల్సి రావడంతో చిరంజీవి కొంచం అసహనానికి లోనవుతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇలా రూమర్స్ వస్తున్న నేపథ్యంలో మెగా అభిమానులు మాత్రం సైరా సినిమా అవుట్ ఫుట్ విషయంలో చిరంజీవి గారు అసంతృప్తిగా ఉన్నదనే వాదనలో అసలు నిజం లేదని అవన్నీ మెగాస్టార్ అంటే గిట్టని వల్లే ఇలా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని చెబుతున్నారు.