కొత్త స్టెప్పులు కావాలని శేఖర్ కి కోరిన చిరంజీవి

  • October 27, 2018 / 06:55 AM IST

తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ ప్రస్తుతం “జార్జియా”లో షూటింగ్ జరుపుకుంటోంది. పోరాట విన్యాసాలు హాలీవుడ్ రేంజ్లో ఉంటాయనేది టీజర్ స్పష్టం చేసింది. అలాగే చిరు నటన, సురేందర్ రెడ్డి టేకింగ్, అమిత్ త్రివేది సంగీతం, రత్నవేలు విజువల్స్ అన్ని కలిసి సినిమా ఓ అద్భుతంగా ఉంటుందనేది అభిమానుల నమ్మకం. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ స్టెప్పులు లేకపోతే మాత్రం ఫ్యాన్స్ కి వెలితిగానే ఉంటుంది. అందుకే ఆ విషయంలో చిరు రాజీ పడడంలేదు. రీసెంట్ గా ఓ డ్యూయట్ సాంగ్ ని రిహార్సల్ చేసినట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. చిరు, నయన తారలపై షూట్ చేసే ఈ పాటకి కొరియోగ్రఫీ చేయమని శేఖర్ మాస్టర్ కి అవకాశం ఇచ్చారు.

ఇతను చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 మూవీలో “అమ్మడు లెట్స్ డు కుమ్ముడు” అనే పాటకి అదిరిపోయే స్టెప్పులు ఇచ్చారు. ఇప్పుడు కూడా అటువంటి స్టెప్పులు ఇస్తారని చిరు భావించారు. కానీ శేఖర్ చిరు ఆశించినట్టు ఇవ్వలేకపోయారంట. అందుకే మళ్ళీ ప్రాక్టీస్ చేసి రమ్మన్నట్టు చెప్పుకుంటున్నారు. నేటి జనరేషన్ కి తగ్గట్టు.. మెగాస్టార్ రేంజ్ కి తగినట్టు కొత్త స్టెప్స్ లేకపోతే ఎట్టా… అందుకే శేఖర్ అదే పనిలోనే ఉన్నారు. సినిమా రారాజు అమితాబ్ బచ్చన్, డేరింగ్ స్టార్ జగపతి బాబు, కన్నడ స్టార్ కిచ్చ సుదీప్, తమిళ హీరో విజయ్ సేతు పతి లు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus