కామెడీ టైమింగ్‌లో ఆయనకు సాటి లేదు. ఈ మాట మేం అన్నది కాదు.. మొత్తం సినిమా పరిశ్రమే అంటోంది. అయితే ఆయన టైమింగ్ కేవలం స్క్రీన్‌పై కామెడీ పండించడంలోనే కాదు.. ఆఫ్ స్క్రీన్ సెటైర్లు, కౌంటర్లు వేయడంలో కూడా ఉంటుంది. ఎవరాయన అని అనుకుంటున్నారా.. ఇంకెవరు మెగాస్టార్ చిరంజీవి. వెండితెరపై అన్ని జోనర్లలోనూ తనేంటో నిరూపించిన బాస్.. టైమింగ్ విషయంలోనూ స్టిల్ తానే నెంబర్ వన్ అని మరోసారి ఆఫ్ స్క్రీన్‌లో నిరూపించారు.
సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో జేసన్ సంజయ్ తెరకెక్కించిన సినిమా ‘సిగ్మా’. ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఆ కార్యక్రమానికి చిరంజీవి చీఫ్ గెస్ట్ వచ్చారు. ఈ క్రమంలో ఆ స్పీచ్‌లో కొన్ని కౌంటర్లు వేశారు. అవి మామూలుగా చూస్తే ఎవరికీ అర్థం కాకపోవచ్చు. కానీ ఆయన్ను రెగ్యులర్ ఫాలో అయ్యేవారికి అవి కామెంట్లు కావు.. తనపై వస్తున్న కామెంట్లకు రిటర్న్ గిఫ్ట్‌లు అని అర్థమవుతుంది.
‘విశ్వంభర’ సినిమా లో చిరు పక్కన నటించే ఛాన్స్ ఫరియాకు వచ్చింది. అయితే.. ఎందుకో ఆ కాంబినేషన్ ఆగిపోయింది. ఇదే విషయాన్ని చిరంజీవి ఆ వేదికపై గుర్తు చేసుకొంటూ ‘నాకు నువ్వు నో చెప్పావా ఫరియా.. నన్ను తొక్కేయాలని చూశావా’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. చిరంజీవి లాంటి వ్యక్తిని ఆమె తొక్కేయగలదా అనే డౌట్ రావొచ్చు. కానీ ఆ మాట ఆయన అన్నది ఫరియాను కాదు.. ఊరికనే ‘తొక్కేస్తున్నాడు’ అంటూ చిరు మీద ట్రోల్స్ చేస్తున్న వారిని ఉద్దేశించి అన్నాడు.
నిజానికి తన మీద వచ్చే ట్రోలింగ్‌లను సైతం వాడుకుని, కౌంటర్లు ఇవ్వడం చిరంజీవి ఇటీవల వరుసగా రెండోసారి అని చెప్పొచ్చు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలో ‘ఇందువదన కుందరదనా.. వావ్’ అంటూ ఓ మాట అంటే ఓ జంతువు పారిపోతుంది. ఇది తన మీద ఉన్న ట్రోలింగ్‌ని వాడి.. ‘మీరు నన్ను ట్రోల్ చేసేదేంటి’ అనే స్టేట్‌మెంట్ ఇవ్వడమే అని చెప్పొచ్చు. ఇప్పుడు ‘తొక్కేయడం’ కూడా అలాంటిదే.