సైరా చిత్రంలో అనుష్క రోల్ గురించి చెప్పిన మెగాస్టార్

  • August 24, 2019 / 01:50 PM IST

“సాహో” తర్వాత తెలుగు సినిమా స్థాయిని పెంచి.. పాన్ ఇండియా రేంజ్ సంపాదించుకున్న సినిమా “సైరా నరసింహా రెడ్డి”. చిరంజీవి టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మరియు ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అమితాబ్ బచ్చన్, సుదీప్, నయనతార, తమన్నా, రవికిషన్, విజయ్ సేతుపతి వంటి భారీ తారాగణం ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో జేజమ్మ అనుష్క కూడా నటిస్తుందన్న విషయం తెలిసినప్పటికీ.. ఆమె పాత్ర ఏమిటనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

అయితే.. సైరా ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూస్ ఇస్తున్న చిరంజీవి ఈ చిత్రంలో అనుష్క పాత్ర ఏమిటనేది విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రంలో అనుష్క వీర వనిత ఝాన్సీ లక్ష్మీ భాయి పాత్రలో కనిపించబోతోంది. సినిమాలో సైరా నరసింహారెడ్డి పాత్రను పరిచయం చేసేది కూడా ఝాన్సీ పాత్రేనట. “అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి” అనంతరం అనుష్క పోషిస్తున్న పవర్ ఫుల్ రోల్ ఇది. మరి ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయంలో క్లారిటీ రావాలంటే సినిమా విడుదల వరకూ వెయిట్ చేయాలా లేక ఈలోపు టీజర్ ఏమైనా రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus