వార్నింగ్ – ముందు నీపని చూస్కో…

  • August 8, 2016 / 07:36 AM IST

మెగాస్టార్ తనయుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అంటే మెగాస్టార్ కు చాలా ప్రాణం. అయితే అలాంటి చెర్రీపై చిరుకి కోపం వచ్చిందా?? నిజమేనా అంటే….నిజమే అంటున్నాయి….టాలీవుడ్ వర్గాలు..విషయం ఏంటంటే…ప్రస్తుతం టాలీవుడ్ అంతా చిరు 150వ సినిమా గురించే న్యూస్. ఇక చెర్రీ కూడా ఒక పక్క చెర్రీ కూడా తన సినిమా ధృవ షూటింగ్ చేసుకుంటేనే….మెగాస్టార్ 150వ సినిమా నిర్మాణంలో బిజీగా ఉంటున్నాడు…

మరి అంతలా బిజీగా ఉంటున్న చెర్రీపై చిరు కి కోపం ఎందుకు వచ్చింది అంటే….మాత్రం ఈ మ్యాటర్ చూడాల్సిందే…చెర్రీ నిరాంతగా వ్యవహరిస్తున్న చిరు 150వ సినిమాపై పూర్తి ఫోకస్ తో ఉన్నాడని….చిరు 150వసినిమా గురించి… అది ఎలా వస్తుంది… అనే విషయాల గురించి అర్థరాత్రి ఫోన్‌ చేసి మరీ వినాయక్ ను అడగడం, మధ్యమధ్యలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయమని వినాయక్ ను ఇబ్బంది పెట్టడం. ఇలా చేస్తూ ఉండడంతో, రామ్‌చరణ్‌ బిహేవియర్‌ వినాయక్‌కు నచ్చలేదట.

ఇలా అయితే సినిమా సంక్రాంతికి రావడం కష్టమేనని.. ఆవిషయంలో తాను హామీ ఇవ్వలేనని మెగాస్టార్‌తో చెప్పుకున్నాడట మన దర్శకుడు. ఇక ఈ విషయం తెలుసుకున్న చిరు….చెర్రీపై సీరియస్ అయినట్లు సమాచారం…150వ సినిమాను పక్కనపెట్టి… ముందు దృవ సినిమా గురించి ఆలోచించమని ఫుల్ క్లాస్ పీకాడని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus