స్టేజీ పై మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులు

  • June 4, 2016 / 09:47 AM IST

ఎటువంటి స్టెప్పు అయిన మెగాస్టార్ చిరంజీవి వేస్తే అందంగా మారిపోవాల్సిందే. బ్రేక్, డిస్కో డ్యాన్స్ లను తన దైన స్టైల్ లో వేసి అదరగొట్టారు. మోవ్ మెంట్ లకు కూడా పేటెంట్ తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. అతని డాన్స్ అంటే ప్రేక్షకులకే కాదు నేటి హీరోల్లో చాలా మందికి ఇష్టం. అంతటి స్టార్ రాజకీయాల్లోకి పోవడంతో అభిమానులకు చిరు  డాన్సు చూసే అవకాశం దూరమైంది. అయన మగధీర, బ్రూస్లీ సినిమాల్లో కనిపించినా స్టెప్పులు వేయక పోవడంతో నిరాశపడ్డారు.

ఇప్పుడు తెరకెక్కనున్న కత్తిలాంటోడు సినిమాలో రాక స్టార్  దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చే పాటలకు చిరు వేసే స్టెప్పుల కోసం అభిమానులతో పాటు తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తోంది. అంతకంటే ముందు చిరంజీవి డాన్స్ చూసే భాగ్యం “మా టీవీ” కల్పిస్తోంది. వారు నిర్వహించే అవార్డుల ఫంక్షన్లో మెగాస్టార్ డాన్స్ వేయనున్నట్లు సమాచారం.

చిరు స్టేజీలపై ప్రదర్శన ఇవ్వడం చాలా అరుదు. మొన్న కూతురు శ్రీజ సంగీత్ వేడుకల్లో డాన్స్ వేసి అక్కడి వారిని అలరించారు. ఇప్పుడు ప్రేక్షకుల నడుమ స్టెప్పులు వేయనున్నారు. మాటీవీలో ఆదివారం (జూన్12)న సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమంలో చిరంజీవి వస్తున్నాడని తెలిసినా చూడకుండా ఎవరైనా ఉంటారా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus