చిరు వలనే బాలయ్యకు హిట్స్ వచ్చాయా..?

Advertisement

స‌రైనోడు ఫంక్ష‌న్లో చిరు మాట్లాడిన మాట‌లు ఇప్పుడు బాల‌య్య ఫ్యాన్స్‌ని బాగా హ‌ర్ట్ చేస్తున్నాయి. తానిచ్చిన‌ స‌ల‌హాల వ‌ల్లే… బాల‌య్య సినిమాలు సింహా, లెజెండ్ ఆడాయ‌న్న అర్థంలో చిరు స్పీచ్ ఇవ్వ‌డం బాల‌య్య ఫ్యాన్స్ ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌య్యాయి. స‌రైనోడు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో చిరు మాట్లాడుతూ బోయ‌పాటి శ్రీ‌ను.. సింహా, లెజెండ్ క‌థ‌ల్ని త‌న‌కే ముందు వినిపించాడ‌ని, క‌థ‌లు విన్నాక కొన్ని మార్పులు చెప్పాన‌ని, వాటిని అప్లై చేసి బాల‌య్య‌తో తీశాడ‌ని వ్యాఖ్యానించాడు చిరు. దాంతో వేదిక‌పై ఉన్న బోయ‌పాటితో పాటు.. ఈ కార్య‌క్ర‌మం వీక్షిస్తున్న ల‌క్ష‌లాది చిరు ఫ్యాన్స్ షాక‌య్యారు. అంటే.. చిరు కోసం రాసుకొన్న క‌థ‌ల్ని బాల‌య్య‌తో తీశాడ‌న్న‌మాట బోయ‌పాటి. అందునా.. చిరు మార్పుల్ని చేర్పుల్నీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని మరీ చేశాడని చెప్పడంతో ఇదొక హాట్ టాపిక్ గా మారింది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus