నిన్న సాయంత్రం ‘పెద్ది’ సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ను హైదరబాద్లో ఉన్న శిల్పకళా వేదికలో నిర్వహించారు. దీనికి ‘పెద్ది’ యూనిట్ తో పాటు చిరంజీవి(Chiranjeevi) కూడా గెస్ట్ గా వచ్చారు. సాధారణంగా చిరు స్పీచ్ లెంగ్త్ ఏ రేంజ్లో ఉంటుందో తెలుసు కదా..! నిన్న కూడా అదే రేంజ్లో ఉంది. తనయుడు రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు చిరు. ‘పెద్ది’ లో చరణ్ నటన చూసి ఎమోషనల్ అయ్యనని.. ఈ సినిమాతో చరణ్ పరిపూర్ణ నటుడు అనిపించుకున్నాడని చిరు చెప్పడం జరిగింది.
అంతేకాకుండా చిరు ఇంకా మాట్లాడుతూ..”చరణ్ వన్ మ్యాన్ షో అంటున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని అంటున్నారు.అవార్డు రానివ్వండి, రాకపోనివ్వండి, అది పెద్ద సమస్య కాదు. ‘రంగస్థలం’కి కూడా చరణ్..కి నేషనల్ అవార్డు రావాలని నాతో సుకుమార్ గారు ఎన్నో సార్లు అన్నారు. ఇది అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్, ‘అంత బాగా చేసాడు మన చరణ్’ అంటూ ఉంటే… అవార్డు రావాల్సిన అవసరం లేదు. అవార్డు రావడానికి ఎన్నో దారులు ఉండొచ్చు.
కానీ ప్రేక్షకుల మనసుల్లో ఇంత అచ్చు గుద్దినట్టు ముద్రింపబడటం అనే దానికి మించిన అవార్డు ఇంకొకటి లేదు” అంటూ చిరు పలికారు. సరిగ్గా ఈ కామెంట్స్ పై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతుంది. చిరు పరోక్షంగా అల్లు అర్జున్ కి చురకలు అంటించినట్టు అంతా మాట్లాడుకుంటున్నారు. ‘పుష్ప’ సినిమాకి గాను అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. చిరు ఇలా అనడంతో ‘అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా?’ అనే చర్చ ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది.
చిరు స్పీచ్..లు ఇలా సెన్సేషన్ అవ్వడం అనేది ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలో కూడా ‘ఎంత స్టార్ గా ఎదిగినా డెడికేషన్, డిసిప్లిన్ ముఖ్యం’ అంటూ చిరు పలికిన మాటలని అల్లు అర్జున్ వ్యవహారశైలితో పోల్చి చాలా మంది నెటిజెన్లు అల్లు అర్జున్ ను ట్రోల్ చేయడం జరిగింది.
‘పెద్ది’ కి నేషనల్ అవార్డ్ వస్తుందని అంటున్నారు
‘రంగస్థలం’ కి నేషనల్ అవార్డు రావాలని సుకుమార్ అన్నారు
అవార్డు వచ్చినా రాకపోయినా ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు.. దానికి మించిన అవార్డు లేదు : చిరంజీవి#PEDDI #RamCharan #CHIRANJEEVI #BuchiBabuSana pic.twitter.com/8VW4MkxYDh
— Filmy Focus (@FilmyFocus) June 23, 2026