చిరంజీవి కోసం సెట్స్ కి వచ్చిన బాలకృష్ణ!

  • August 28, 2018 / 06:50 AM IST

బయట కొందరు ఫ్యాన్స్ వర్గాలు, కులాల చాటున తమ హీరోల పేర్లు చెప్పుకొని తన్నుకుంటున్నా.. మేం మాత్రం కలిసే ఉన్నామని ఎప్పటికప్పుడు మన హీరోలందరూ చెబుతూనే ఉన్నారు. అందుకు తాజా నిదర్శనం నందమూరి బాలకృష్ణ స్వయంగా చిరంజీవిని కలవడం కోసం “సైరా నరసింహారెడ్డి” సెట్స్ కు వెళ్ళడం. ఇదివరకూ ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో బాలకృష్ణ “నేను ఇండస్ట్రీలో కాస్త చనువుగా ఉండేది చిరంజీవితో మాత్రమే” అని పేర్కొనడం తెలిసిందే. పబ్లిక్ గా ఈ ఇద్దరు అగ్ర కథానాయకులు కలిసి పెద్దగా కనిపించకపోయినా.. ఫ్యామిలీ ఫంక్షన్స్ లో విరివిగా కలుస్తూనే ఉంటారు.

ఆ అనుబంధంతోనే ఇటీవల హైద్రాబాద్ లోని సైరా నరసింహా రెడ్డి షూటింగ్ స్పాట్ కు విచ్చేశాడట బాలకృష్ణ. కాసేపు చిత్రబృందంతో పిచ్చాపాటి మాట్లాడడమే కాకుండా అందరితో కలిసి సరదాగా ఫోటోలు కూడా దిగాడట. ఆ ఫోటోలు ఇప్పుడప్పుడే బయటకి రాకపోయినా.. త్వరలోనే విడుదల చేయనున్న మేకింగ్ వీడియోలో ఈ విజువాల్స్ అన్నీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట సైరా టీం. మరి మెగాస్టార్ చిరంజీవి-నందమూరి బాలకృష్ణల అపురూప కలయికను చూడాలంటే ఇంకెన్నాళ్ళు ఆగాలో. ఎంత లేటైనా.. ఆ అద్భుతమైన ఫ్రేమ్ ను చూడ్డం కోసం మెగా మరియు నందమూరి అభిమానులందరూ వెయిట్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus