గీత గోవిందం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రానున్న చిరంజీవి

  • August 8, 2018 / 10:42 AM IST

శ్రీరస్తు శుభమస్తు సినిమాతో మంచి హిట్ అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మూవీ “గీత గోవిందం”. విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి ఆకట్టుకుంటోంది. టీజర్ తో పాటు సాంగ్స్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల వేగం పెంచారు. అందులో భాగంగా ఈనెల 12న విశాఖపట్నంలోని ఆర్.కే బీచ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ని ముఖ్య అథితిగా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అల్లు అరవింద్ మెగాస్టార్ ని కలిసి ఆహ్వానించడం, అందుకు ఆయన ఒకే చెప్పడం కూడా జరిగిపోయినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు మాత్రమే కాదు.. విజయ్ దేవరకొండ కూడా షాక్ అయ్యాడట. ఆ తర్వాత ఆనందపడ్డారు. అతను ఈ ఈవెంట్ కి వస్తే సినిమాపై క్రేజ్ డబల్ అవుతుందని సినీ విశ్లేషకులు చెప్పారు. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ ట్యాక్సీ వాలా సినిమా చేసినప్పటికీ.. ఆ చిత్రం కంటే గీత గోవిందం సినిమానే ముందుగా తీసుకురావడానికి విజయ్ ఆసక్తి కనబరిచారు. ఈ సినిమాతో విజయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందని భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus