‘ఆచార్య’ షూటింగ్ ను మెగాస్టార్ స్కిప్ చేసేలా ఊన్నారే…!

  • November 6, 2020 / 01:02 PM IST

కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల చాలా సినిమాల షూటింగ్ లు వాయిదా పడ్డాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడంతో… ఆగిపోయిన సినిమా షూటింగ్ లు పునః ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో చిరంజీవి – కొరటాల శివ ల ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ ను కూడా తిరిగి ప్రారంభించాలని ప్లాన్ చేసారు. నవంబర్ 9 నుండీ షూటింగ్ ప్రారంభించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే మొదటి షెడ్యూల్ కు చిరు స్కిప్ చేసే సూచనలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది.

కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గని నేపధ్యంలో షూటింగ్ కు జాయిన్ అవ్వడం రిస్క్ అని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ‘ఆచార్య’ చిత్రాన్ని 2021 సమ్మర్ కి విడుదల చేయబోతున్నట్టు కూడా నిర్మాతలు ప్రకటించేశారు. మరి ఇంత స్లోగా చిత్రీకరణ జరుపుతుంటే… ‘ఆచార్య’ సమ్మర్ కి విడుదల అవ్వడం సాధ్యమేనా అన్నది పెద్ద ప్రశ్న. ఇక ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, చరణ్ లు కలిసి నిర్మిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. రాంచరణ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించబోతున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus