వైరల్ అవుతున్న మెగాస్టార్ పిక్..!

  • December 31, 2018 / 08:32 AM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ, కల్యాణ్ దేవ్ దంపతులకు పాప పుట్టిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కళ్యాణ్ దేవ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. తన పాప కాలిముద్ర ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇప్పుడు ఈ విశేషంతో మెగా ఫ్యామిలీలో పండుగ వాతావరణం ఏర్పడింది. ఇక ఈ పాప ఫోటో ను ఎప్పుడు పోస్ట్ చేస్తారు అంటూ కొందరు మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు చిన్న మనవరాలితో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. ఈ ఫొటోలో మనవరాలిని ఎత్తుకుని చిరు దంపతులు మురిసిపోతుండడం విశేషం. ఇక ఈ 2018 వ సంవత్సరం మెగా ఫ్యామిలీకి మంచి ఇయర్ చెప్పుకోవచ్చు. ఇదే సంవత్సరం మెగా పవర్ స్టార్ ‘రంగస్థలం’ చిత్రం సంచలన విజయం నమోదు చేసింది. ఇక రాంచరణ్ -రాజమౌళి – జూ.ఎన్టీఆర్ కాంబినేషన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం కూడా మొదలయ్యింది. అంతేకాదు మెగాస్టార్ 152 వ చిత్రం కూడా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఖరారవ్వడంతో.. పాటు ‘వినయ విధేయ రామా’ చిత్రం కూడా రిలీజ్ కు రెడీ అవుతుండడంతో .. మెగా అభిమాలు కూడా పండుగ చేసుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus