మొదటి షెడ్యూల్ రీ షూట్ ఆలోచనలో చిరు..!!

Advertisement

మెగాస్టార్ చిరంజీవి తన 150 వ చిత్రం షూటింగ్ పై సంతృప్తిగా లేరు. రీసెంట్ గా మొదటి షెడ్యూల్ రషస్ చూసుకున్న చిరుకి అందులో కొన్ని సీన్లు నచ్చలేదంట. తాను ఆలీ తో చేసిన కామెడీ సన్నివేశాలు ఊహించినంత బాగా రాకపోవడంతో మెగాస్టార్ ఆలోచనలో పడ్డారని తెలిసింది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ చిత్రం మూడవ షెడ్యూల్ కి చేరుకుంది. నానక్ రామ్ గూడ లో వేసిన పెద్ద సెట్ లో నిన్నటి నుంచి షూటింగ్ జరుగుతోంది.

ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే, అలీతో కలిసి చేసిన సీన్లు రీ షూట్ చేయాలని భావిస్తున్నారు. ఆలీని తప్పించి ఆ స్థానంలో సునీల్ ని తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. మొదట్లో చిరు స్నేహితుడి పాత్రలో సునీల్ నే సంప్రదించారు. కానీ అప్పుడు సునీల్ తన చిత్రాలతో బిజీగా ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక పోయారు. ఆలీని తీసుకున్నారు. షూటింగ్ కూడా పూర్తి చేశారు. కానీ అది నచ్చక పోయేసరికి మళ్ళీ సునీల్ ని అవకాశము వరించింది. ఈసారి చిరు తో కలిసి నటించే ఛాన్స్ ని సునీల్ మిస్ చేసుకోలేదు,. వెంటనే ఒప్పుకున్నట్లు సమాచారం.

మూడవ షెడ్యూల్ పూర్తి అయినా వెంటనే అలీతో చేసిన సీన్లన్నీ సునీల్ తో మళ్ళీ చిత్రీకరించనున్నారు. చిరంజీవి మొదట నుంచి తన రీ ఎంట్రీ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. తొందరపడి అడుగు వేయడంలేదు. అలీ రీ ప్లేస్ విషయంలో ఇది మరో సారి నిరూపితమైంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news