ఎన్నో రోజుల తరువాత మెగా స్టార్, పవర్ స్టార్ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో వారిని తిలకించేందుకు అభిమానులకు రెండు కళ్ళు సరిపోలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే నిన్న జరిగిన వేడుకలో చిరు స్పీచ్ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ లో రికార్డ్స్ పరంపరపై తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. బాహుబలిని గుర్తు చేసుకున్న చిరు, బాహుబలి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే, ఇక ఆ సినిమాను తలదన్నేలా ఈ సినిమా హిట్ కావాలి అని చెబుతూనే…ఆ సినిమా రికార్డులను మన సర్దార్ బ్రేక్ చెయ్యాలి. ఇక ఆ రికార్డులను మన సినిమా బ్రేక్ చేసేసి సరికొత్త రికార్డు నెలకొల్పితే…ఆ తరువాత వేరే హీరోల సినిమా రికార్డులు ఈ రికార్డులను బద్దలు కొట్టాలి. రికార్డులు ఎవ్వరి సొంతం కాదు. ఏ ఒక్కరికో చెందవ్. అందరూ రికార్డులు కొట్టాలి.
వాటిని మరొకరకు బ్రేక్ చేయాలి. అప్పుడే సినిమా ఇండస్ర్టీ ఆరోగ్యకరంగా ఉంటుంది” అంటూ చిరు మెగా అభిమానులను ఉద్దేశించి ప్రసంగించిన తీరు ఆధ్యంతం ఆకట్టుకుంది. ఇక మాట్లాడే క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవి పై చిరు వేసిన శెటైర్ అక్కడ ఒక్క క్షణం నవ్వులు పూయించింది. దేవి గురించి మాట్లాడుతూ..తాను చిన్నప్పుడు దేవికి వాచ్ ఇచ్చి నీ టైమ్ మారిపోతుంది అని చెబితే.. ఇప్పుడు నిర్మాతలకు మాత్రమే కాదు.. చివరకు తనకు కూడా టైమ్ ఇవ్వట్లేదని జోక్ చేశారు చిరంజీవి. వెంటనే దేవి సార్ అనగానే, తన తదుపరి సినిమాలో దేవినే మ్యూజిక్ డైరెక్టర్ అంటూ కన్ఫర్మ్ చేశారు చిరు. ఇలా ఆధ్యంతం మెగా అభిమానులను అలరిస్తూ సాగిపోయింది సర్దార్ ఆడియో వేడుక.
https://www.youtube.com/watch?v=RLKpAGAOXgE