‘రెబెల్ స్టార్’గా చిరు….’పవర్ స్టార్’ గా బన్నీ!!!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే….ఆయన మొదలు పెట్టిన మెగా శిబిరం నుంచి వచ్చిన హీరోలు తమదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ….హిట్స్ ఫ్ల్యాప్స్ తో సంభందం లేకుండా దూసుకుపోతున్నారు….అయితే మెగాస్టార్ సైతం దాదాపుగా 8ఏళ్ల సుధీర్గ విరామం తరువాత మళ్ళీ ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు…అయితే అదే క్రమంలో చిరుతో ఒక ముల్టీ స్టారర్ చేస్తే…బావుంటుంది అన్న ఆలోచనలో ఉన్నారు కొందరు…అంతేకాకుండా…ఆ సినిమాలో హీరోగా…సారి..సారి..ఆ సినిమా బన్నీది అయితే ఇంకా బావుంటుంది అని మరికొందరు అనుకున్నారు…ఇంతకీ ఈ కన్ఫ్యూషన్ ఏంటి అంటారా….అయితే ఒక్కసారి ఈ కధ చదవండి….మనకు మాదిరిగానే….కన్నడలో కూడా రెబెల్ స్టార్….పవర్ స్టార్ ఉన్నారు…..అదే…రెబెల్ స్టార్ అంటే…మన అంబరీష్, పవర్ స్టార్ అంటే మన పునీత్ రాజ్ కుమార్.

అక్కడ వారికి ఉన్న క్రేజ్..ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకొనవసరం లేదు… అయితే తాజాగా వాళ్ళిద్దరూ…కలిసి ఓ సినిమా చేశారు. ‘దొడ్డమానే హడ్గ’ పేరుతో ఓ చిత్రం రూపొందింది. సెప్టెంబర్ 30న ఈ చిత్రం విడుదల కానుంది..ఇదిలా ఉంటే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చెయ్యాలి అన్న ఆలోచనలో ఉన్నారు కొందరు దర్శక నిర్మాతలు…..అయితే ఈ సినిమాలో హీరోగా మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే బావుంటుంది అని పునీత్ రాజ్ కుమార్ పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే.. సరిగ్గా సరిపోతాడని అనుకుంటున్నారు…ఇంతవరకూ బాగానే ఉంది….మరి కన్నడలో అంబరీష్ చేసిన పాత్రను.. తెలుగులో ఎవరు చేస్తారు అన్న సందిగ్ధంలో ఉన్న దర్శక నిర్మాతలు…ఈ పాత్రను…మెగాస్టార్ చిరంజీవితో చేయిస్తే….ఈ సినిమా సరికొత్త రికార్డులకి వేదికగా మారుతుంది అని ఆలోచిస్తున్నారు…మరి ఈ పాత్ర చేసేందుకు మన మెగాస్టార్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus