80, 90ల కాలంలో హీరోయిన్లుగా ఒక ఊపు ఊపిన హీరోయిన్లందరూ తదనంతరం అమ్మ, వదిన పాత్రలకు సెటిల్ అయిపోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. కానీ వారిలో చాలా తక్కువమంది మాత్రమే అత్త పాత్రలకు సెట్ అయ్యారు. అందుకు కారణం మన దర్శకులు అత్తలు కూడా కాస్త గ్లామరస్ గా, సెక్సీగా ఉండాలని కోరుకోవడమే. అందుకే.. వాణిశ్రీ తర్వాత నదియా. రాశి లాంటి వారు మాత్రమే అత్త పాత్రల్లో క్లిక్ అయ్యారు. ఇప్పుడు వారి బాటలోనే నిన్నటితరం కథానాయకి నగ్మా కూడా ముందడుగు వేస్తోంది.
టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గిపోయాక భోజ్ పురి షిఫ్ట్ అయిన నగ్మా అక్కడ కూడా పని అయిపోయాక రాజకీయాల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు రాజకీయాల్లో కూడా క్రేజ్ తగ్గిపోవడంతో మళ్ళీ సినిమాల్లోకి రావాలని కోరుకొంటోంది నగ్మా. ఇటీవల టి.ఎస్.ఆర్ అవార్డ్స్ ప్రెస్ మీట్స్ లో కనిపించిన నగ్మాను చూసి చాలామంది షాక్ అయ్యారు. కాస్త బొద్దుగా తయారవ్వడం మినహా ఆమెలో పెద్దగా మార్పు లేదు. అందుకే త్రివిక్రమ్ కూడా ఆమెను తన సినిమాలో ఒక ముఖ్యపాత్ర కోసం సెలక్ట్ చేసుకున్నాడట. అల్లు అర్జున్ కి అత్తగా నగ్మా బాగుంటుందని భావించే ఈ నిర్ణయం తీసుకొన్నాడట త్రివిక్రమ్. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియదు కానీ.. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం భలే ఉంటుంది.