మరోసారి వీణ స్టెప్పేస్తున్నాడు!

  • August 3, 2016 / 12:27 PM IST

చిరంజీవి నటించిన హిట్ చిత్రాలలో ‘ఇంద్ర’ సినిమా ఒకటి. ఈ సినిమాలో ఆయన ఒక పాటలో చేసిన వీణ స్టెప్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత నటుడు సునీల్ ఈ స్టెప్ ను తన సినిమాలో ఉపయోగించాడు. రీసెంట్ గా పవన్ కల్యాణ్ కూడా తన ‘సర్ధార్ గబ్బార్ సింగ్’ సినిమాలో వీణ స్టెప్ వేశాడు. తాజాగా చిరంజీవి మళ్ళీ తన 150వ సినిమాలో ఈ వీణ స్టెప్ వేయనున్నారని సమాచారం.

ఇంకో విశేషమేమిటంటే.. సినిమాలో చిరంజీవితో పాటు సునీల్, సాయి ధరం తేజ్ లు కూడా ఈ స్టెప్ వేస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పాట కోసం ప్రత్యేకంగా లారెన్స్ ను రంగంలోకి దింపుతున్నట్లు చెబుతున్నారు. లారెన్స్ ఎంత బిజీగా ఉన్న చిరంజీవి కోసం ఈ పాట కొరియోగ్రాఫి చేయడానికి ‘ఊ’ కొట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రోజుకో ప్రత్యేకతను ఈ సినిమాకు యాడ్ చేస్తున్నారు.

పరుచూరి బ్రదర్స్ పాటు, సాయి మాధవ్ బుర్రా కూడా డైలాగ్స్ అందించడం, ఇప్పుడు చిరంజీవి వీణ స్టెప్ వేయడం, ఇవన్నీ చూస్తుంటే కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను దాటడం ఖాయమనిపిస్తోంది. ఇక మెగాస్టార్ మరోసారి తన హవా షురూ చేయడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus