కత్తిలాంటివాడు…ముల్టీస్టారర్??నిజమా??

  • July 19, 2016 / 01:38 PM IST

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ఇక్కట్లను తొలగించుకుని, మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు అని తెలియగానే ఆయన అభిమానుల గుండెలో ఆనందంతో ఉప్పొంగిపోయాయి. అయితే అప్పట్లో మెగాస్టార్ గా చక్రం తిప్పిన చిరు రీఎంట్రీ అనుకున్నంత హైప్ లో మాత్రం లేదు అనే చెప్పాలి. అడుగడుగునా ఇబ్బందులతో ఈ సినిమా ముందుకు సాగుతుంది.

ఇదిలా ఉంటే…ఈ సినిమాలో చిరు ఒక్కడే కాకుండా ఫ్యామిలీ మొత్తం నటించే అవకాశం ఉంది అన్న టాక్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళితే…ఈ సినిమాలో చిరు ఒక్కడే కాదంటా….మెగా స్టార్ పేరు చెప్పుకుని ఇండస్ట్రీలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరోలు అందరూ ఈ సినిమాకు తమవంతు సహకారంగా కనిపించనున్నారు అని తెలుస్తుంది. ఇప్పటికే మెగా తనయుడు చెర్రీ ఈ సినిమాలో ఒక సాంగ్ లో కనిపించనున్నాడు అని తెలియడంతో ఆనందంతో మునిగిపోయిన ఫ్యాన్స్ కు మరో సూపర్ న్యూస్ ఏంటి అంటే…ఈ సినిమాలో మేనళ్లుడు సాయి ధరం తేజ్ కూడా అలా వచ్చి ఇలా వెళ్లే స్పెషల్ రోల్ చేస్తున్నాడట.

అంతేకాదు వరుణ్ తేజ్ కూడా చిన్న రోల్ లో షాక్ ఇస్తాడని అంటున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా..మెగా బ్యాచ్ లో ఒకడుగా పిలిచుకునే అల్లు అర్జున సైతం ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలువాస్తున్నా ఇంకా సరైన సమాచారం మాత్రం అందడం లేదు. ఇక ఇదంతా చూస్తూ టాలీవుడ్ విశ్లేషకులు ఏమంటారు అంటే….సోలో హిట్ కొట్టగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు ఈ సోకులన్నీ అవసరమా అని అంటున్నారు.  మరి ఈ హంగులన్నీ చిరుకు కలసి వస్తాయో లేదో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus