చాలా కాలం తరువాత తేజు కి ఓ హిట్టొచ్చింది. తను హీరోగా నటించిన తాజా చిత్రం ‘చిత్రలహరి’ ఫైనల్ గా బ్రేక్ ఈవెన్ స్టేటస్ ను దక్కించుకుంది. కళ్యాణి ప్రియదర్శన్, నివేధా పేతురేజ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసాడు. ఈ చిత్రంలో సునీల్ కూడా ప్రత్యేక పాత్ర పోషించాడు. 6 ప్లాపులు తరువాత వచ్చిన ఈ చిత్రం సాయి తేజ్ కు కాస్త రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక మొదటి వారం పూర్తయ్యే సరికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకుంది. ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 13.56 కోట్ల షేర్ ను రాబట్టింది.
‘చిత్రలహరి’ మొదటి 3 రోజుల ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
సీడెడ్ – 1.82 కోట్ల
ఈస్ట్ – 1.04 కోట్లు
కృష్ణా – 0.92 కోట్లు
గుంటూరు – 0.99 కోట్లు
వెస్ట్ – 0.69 కోట్లు
నెల్లూరు – 0.46 కోట్లు
————————————————
ఏపీ + తెలంగాణ – 11.69 కోట్లు
రెస్ట్ అఫ్
ఇండియా – 0.92 కోట్లు
ఓవర్సీస్ – 0.95 కోట్లు (కరెక్టడ్)
————————————————-
వరల్డ్ వైడ్ టోటల్ – 13.56 కోట్లు (షేర్)
————————————————–
‘చిత్రలహరి’ చిత్రానికి 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి వీకెండ్ డీసెంట్ కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం.. వీక్ డేస్ లో స్లో అండ్ స్టడీ అన్నట్టు రాబట్టింది. ఓవర్ ఆల్ గా బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ స్టేటస్ దక్కించుకుంది. అయితే తాజాగా ‘జెర్సీ’ ‘కాంచన3’ చిత్రాలు రిలీజవ్వడంతో ఈ చిత్ర కలెక్షన్ల పై ఆ ఎఫెక్ట్ పడింది. ఏదేమైనా దాదాపు మూడేళ్ళ తరువాత సాయి తేజ్ కు హిట్టు దక్కింది. మరి ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.