చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌‌పై ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభం

చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా గుణి మంచికంటి దర్శకత్వంలో అతిరథ మహారధుల సమక్షములో కొత్త సినిమాను ప్రారంభమైంది. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, ఆస్తా, మాళవి తదితరులు ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సోమవారం నాడు ఘనంగా జరిగింది.

ఈ చిత్రానికి కొండల్ జిన్నా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రమేష్ ప్రసాద్ అక్కినేని, ఆది శేషగిరి రావు ఘట్టమనేని, కేఎస్ రామారావు, డైరెక్టర్ పి. మహేష్ బాబు, కేఎల్ నారాయణ, తమ్మారెడ్డి భరద్వాజ్, పరుచూరి గోపాలకృష్ణ, బి గోపాల్, కోటగిరి వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సురేష్, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Chitralayam Studios announces its third film

ముహూర్తపు సన్నివేశానికి రమేష్ ప్రసాద్ అక్కినేని స్క్రిప్ట్‌ను అందించగా.. ఆది శేషగిరి రావు క్లాప్ కొట్టారు. కేఎస్ రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. మహేష్ బాబు.పి గౌరవ దర్శకత్వం వహించారు. నేపాల్ దేశ రాజవంశానికి చెందిన సమృద్ధి ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.

నటీనటులు –

టిను ఆనంద్, ఉపేంద్ర , జార్జ్ మరియన్, అక్షయ్, కార్తికేయ, అభినవ్, హర్ష, కిషోర్ కృష్ణ, ఆస్తా, మాళవి, సమృద్ధి, విష్ణు ఓయ్, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, అనీష్ కురివిల్లా, కాదంబరి కిరణ్ తదితరులు

సాంకేతిక బృందం –

బ్యానర్ : చిత్రాలయం స్టూడియోస్
నిర్మాత : వేణు దోనేపూడి
సహ నిర్మాత : కొండల్ జిన్నా
దర్శకత్వం : గుణి మంచికంటి
సంగీతం : స్టీఫెన్, ఆనంద్
ఆర్ట్ : సాహి సురేష్
ఎడిటింగ్ : విజయ్ ముక్తవరపు
కెమెరామెన్ : అజయ్ అబ్రహం జార్జ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వైశాఖ్ నాయర్
కో డైెరెక్టర్ : కిషోర్
కాస్ట్యూమ్స్ : ప్రియాంక
కొరియోగ్రఫీ – జెడి. మాస్టర్
యాక్షన్స్ – నటరాజ్
పి.ఆర్.ఒ : మోహన్ తుమ్మల

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus