చిన్నప్పట్నుంచి హీరో అవ్వాలన్న ఆశ ఉందొ లేక తన పెళ్లికి హాజరైన స్టార్లను చూసి వారి వైభోగాలను చూసి టెంప్ట్ అయ్యాడో తెలియదుగానీ.. చిరు చిన్నల్లుడు కళ్యాణ్ కూడా ఇప్పుడు హీరోగా వెండితెర రంగప్రవేశం చేయనున్నాడు. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ త్వరలో నిర్మాణ రంగంలోకి అడుగిడనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నిర్మాతగా తొలి సినిమాతో తన భర్తనే హీరోగా ఇంట్రడ్యూస్ చేయనుందట శ్రీజ.
ఈ సినిమాకి డైరెక్టర్ మరియు హీరోయిన్ కోసం ప్రస్తుతం శ్రీజ వెతుకుతొంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో అరడజనుకు పైగా హీరోలున్నారు.. ఇప్పుడు ఇంకో హీరో యాడ్ అయ్యాడన్నమాట!