ఆంధ్రప్రదేశ్ లో మహేష్ కత్తి అరెస్ట్!

జర్నలిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత రివ్యూలతో లేనిపోని వివాదాలతో పబ్లిక్ ఫిగర్ గా మారిన మహేష్ కత్తి ఆ తర్వాత బిగ్ బాస్ షో కంటెస్టెంట్ గా వెళ్ళడం, అక్కడ ఎలిమినేట్ అయ్యాక బయటకి వచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేసి స్టేట్ లెవల్ లో ఫ్రీ పబ్లిసిటీతోపాటు లెక్కలేనంతమంది శత్రువులను కూడా సంపాదించుకొన్నాడు. శ్రీరెడ్డి ఇష్యూ జరుగుతున్న టైమ్ లోనూ మహేష్ కత్తి మీద క్యాస్టింగ్ కౌచ్ ఎలిగేషన్స్ వచ్చాయి. అయితే వాటిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. మరి తన ఉనికిని మరోమారు కాస్త గట్టిగా ప్రకటించుకోవాలనుకొన్నాడో లేక ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకొన్నాడో తెలియదు కానీ.. ఉన్నట్లుండి రామాయణం మీద పడ్డాడు. శ్రీరాముడు దాగుల్బాజీ అంటూ కామెంట్స్ చేసి మరోసారి అనవసర చర్చలకు తెరలేపాడు.

ఈసారి ఏకంగా హిందూ సంస్థలు రంగంలోకి దిగాయి.. దేశం నలుమూలల నుంచి మహేష్ కత్తికి బెదిరింపులు మొదలయ్యాయి. సాధారణంగానే తనదైన వ్యంగ్యమైన వ్యాఖ్యానాలతో రెచ్చగొట్టే మహేష్ కత్తి.. ఈ వివాదాన్ని ఫేస్ బుక్ లైవ్ మరియు ట్విట్టర్ ద్వారా మరింత పెద్దది చేసేందుకు ప్రయత్నించాడు. దాంతో కొందరు హిందూ మత పెద్దలు ఇన్వాల్వ్ అవ్వడం మొదలైంది. దీంతో ఈ ఇష్యూ సీరియస్ అవుతుండడంతో మహేష్ కత్తిని ఇవాళ కోర్ట్ నగర బహిష్కరణ చేసింది. తమ ఆదేశం లేకుండా హైద్రాబాద్ రావద్దని చెప్పింది. ఈమేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కత్తి మహేష్ ను అతడిస్ నేటివ్ ప్లేస్ అయిన చిత్తూరు జిల్లా పోలీసులకు అప్పగించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus