బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ‘ఇషక్ జాదే’, ‘శుద్ దేశీ రొమాన్స్’, ‘గోల్ మాల్ అగైన్’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన ‘కోడ్ నేమ్ తిరంగా’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. రిబు దాస్ గుప్తా అనే బెంగాలీ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు.
శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమాకి తొలిరోజు వచ్చిన కలెక్షన్స్ చూసి బాలీవుడ్ షాక్ అవుతోంది. ఇండియా మొత్తం కలిపి ఈ సినిమాకి కేవలం రూ.15 లక్షల కలెక్షన్ మాత్రమే వచ్చాయి. పరిణీతి చివరిగా నటించిన సినిమా ‘సైనా’కి తొలిరోజు రూ.50 లక్షల కలెక్షన్స్ వచ్చాయి. అవే తక్కువ కలెక్షన్స్ అనుకుంటే ఇప్పుడు మరీ దారుణమైన వసూళ్లు వచ్చాయి. ‘సైనా’ బయోపిక్ కావడం.. పరిణీతి ఫామ్ లో లేకపోవడంతో కలెక్షన్స్ తగ్గాయని అందరూ అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఆమె నటించిన ‘కోడ్ నేమ్ తిరంగా’ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సినిమా. ఇలాంటి కథకు పదిహేను లక్షల కలెక్షన్స్ అంటే.. రిలీజ్ ఖర్చు, థియేటర్ల మెయింటైనెన్స్‌కి కూడా సరిపోవు. ఇదివరకు బాలీవుడ్ నుంచి ఎలాంటి సినిమా వచ్చి తొలిరోజు కనీసపు కలెక్షన్స్ వచ్చేవి. కానీ కోవిడ్ తరువాత పరిస్థితి మారింది.
నార్త్ ఆడియన్స్ థియేటర్లకు రావడం మానేశారు. ఓటీటీలకు అలవాటు పడడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ మొహమే చూడడం లేదు. పెద్ద హీరోల సినిమాలకే కలెక్షన్స్ ఉండడం లేదు. ఇక పరిణీతి చోప్రా నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే థియేటర్ కి ఎవరొస్తారు..? సినిమా సూపర్ హిట్ అంటే తప్ప ఎవరూ థియేటర్లకు వెళ్లేలా లేరు. ఇప్పట్లో బాలీవుడ్ కోలుకునేలా లేదు.
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!