చిరు 150 వ సినిమాలో హైలెట్ గా కాయిన్ ఫైట్..!!

  • August 6, 2016 / 10:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150 వ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. కొన్నిరోజుల క్రితం  హైదరాబాద్ శివార్లలోని సింగప్పకొండ గ్రామంలో రెండవ షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. మాస్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కోసం ప్రముఖ ఆర్ట్ డైరక్టర్ తోట తరిణి సెట్స్ డిజైన్ చేశారు. నానక్ రామ్ గూడా లో ఆయన పెద్ద వృద్ధాశ్రమం సెట్ ని వేశారు. ఇక్కడ నిన్నటి నుంచి మూడవ షెడ్యూల్ మొదలయింది.

షూటింగ్ లొకేషన్ కు నిర్మాత రామ్ చరణ్ చేరుకొని పనులను పరిశీలించారు. రోబో, బ్రహ్మోత్సవం వంటి చిత్రాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చిరుని కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మూవీలో చిరు స్పెషల్ ఫైట్ చేయనున్నట్లు వార్త బయటకు వచ్చింది. కాయిన్ ఫైట్ చిత్రంలో హైలైట్ గా నిలువనుందని సమాచారం. ఇందుకోసం రత్నవేలు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారని తెలిసింది.

వి.వి.వినాయక్ టేకింగ్ కి దేవీ శ్రీ ప్రసాద్ బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ కలిసి అభిమానులకు కనువిందు కానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. చిరంజీవి పక్కన టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్ తొలిసారి ఆడి పాడనుంది. రైతుల కోసం పోరాడే నాయకుడిగా చిరు నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేసేందుకు నిర్మాత ప్లాన్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus