గత కొద్ది రోజులుగా కీర్తి సురేష్ పెళ్ళి చేసుకోబోతోంది అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఓ ప్రముఖ రాజకీయవేత్తతో.. కీర్తి సురేష్ పెళ్ళి ఉండబోతుంది అని.. అది కూడా ఇదే ఏడాది ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలలో నిజం లేదని కూడా కీర్తి క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు వరుస సినిమాలకు సైన్ చేసి బిజీ గా ఉన్నాను..
2021 పూర్తయ్యే వరకూ నేను చాలా బిజీ.. నాకు పెళ్లి చేసుకునే టైం లేదు. ఒకవేళ ఉంటే.. నేనే అధికారికంగా ప్రకటిస్తాను. దయచేసి ఇలాంటి వార్తలను ఆపండి అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. గతంలో కూడా చాలా సార్లు కీర్తి పెళ్ళి పై వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల వెనుక ఓ కమెడియన్ ఉన్నాడనేది తాజా సమాచారం. అతనే సతీష్ ముత్తుకృష్ణన్.
ఇతనే కీర్తి సురేష్ పెళ్లి పుకార్లను క్రియేట్ చేసి వైరల్ చేయించాడు అంటూ టాక్. ఈ నేపధ్యంలో అతనికి ఫోన్ చేసి మరీ కీర్తి తిట్టినట్లు కూడా చెన్నై మీడియా వర్గాల సమాచారం. అయితే సతీష్ ఈ పుకార్లను ఎందుకు సృష్టించాడు. ఇది నిజమేనా…? సతీష్… కీర్తికి మంచి స్నేహితుడు కూడా..! ఈ విషయాల పై అతను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Most Recommended Video
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!