హాస్పిటల్ బెడ్ పై నుండీ సెల్ఫీ వీడియోతో షాకిచ్చిన పృథ్వీ..!

’30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అంటూ సినిమాల్లో తన కామెడీతో తెగ నవ్వించే పృథ్వీ.. ఇప్పుడు తీవ్ర అనర్యోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ పాలయ్యాడు. దీంతో ‘అతనికి కరోనా సోకి ఉంటుంది’ అని అంతా అనుకుంటున్న తరుణంలో ఓ సేల్ఫీ వీడియోతో అందరి అనుమానాలకు క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో ద్వారా పృథ్వీ మాట్లాడుతూ.. “10 రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను. అందులోనూ జలుబు తీవ్రంగా ఉండటంతో హాస్పిటల్ కు వెళ్లి అన్ని టెస్టులు చేయించుకున్నాను.

రిపోర్ట్స్ లో కోవిడ్ నెగెటివ్ అని వచ్చింది. ‘కానీ ఎందుకైనా మంచిది.. ఓ 15 రోజులు క్వారంటైన్‌లో జాయిన్ అవ్వండి’ అని డాక్టర్లు చెప్పడంతో నిన్న అర్థరాత్రి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను. త్వరగా కోలుకోవాలని భావిస్తున్నాను.అందుకు మీ అందరి ఆశీర్వాదంతో పాటు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈయన మాట్లాడటానికి కూడా చాలా కష్టపడుతున్నట్టు ఈ వీడియో ద్వారా స్పష్టమవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus