సప్తగిరి రెమ్యునిరేషన్ ఎంతో తెలుసా??

సహజంగా ఏ సినిమా పరిశ్రమలో అయినా..టాలెంట్ కన్నా…టైమింగ్, అంతకన్నా అదృష్టం చాలా ముఖ్యం. అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని మన వాళ్ళు అంటారు కదా…అలాగే…సినిమాల్లో డిమాండ్ ఉన్న‌ప్పుడే నాలుగు రాళ్లు వెన‌కేసుకోవాలి అని సినిమా వాళ్ళు అంటూ ఉంటారు…ఎందుకంటే….సినిమా పరిశ్రమలో హీరోల‌కు లాంగ్ ర‌న్ లైఫ్ ఉంటుంది కాబ‌ట్టి..వాళ్ల‌కు ఓ సినిమా హిట్ అయినా…రెండు సినిమాలు ప్లాప్ అయినా వాళ్లు రెమ్యున‌రేష‌న్ విష‌యంలో పెద్ద‌గా ప‌ట్టించుకోరు. ఇక హీరోయిన్లు, క‌మెడియ‌న్ల‌లో చాలా మందికి లైఫ్ త‌క్కువ‌గా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో వీళ్లు ఫామ్‌లో ఉన్న‌ప్పుడు, డిమాండ్ ఉన్న‌ప్పుడు నాలుగు రాళ్లు వెన‌కేసుకునేందుకు భారీగా డిమాండ్ చేస్తుంటారు. అదే క్రమంలో తాజాగా టాలీవుడ్ లో ఒక కమీడియన్ విషయం, ఆయన డిమాండ్ విషయం చక్కెర్లు కొడుతుంది…ఆయన ఎవరు అంటే….మన సప్తగిరి….
దాదాపుగా సీనియ‌ర్ క‌మెడియ‌న్లు వ‌రుస‌గా చనిపోవడం, దీంతో మ‌రికొంద‌రు సీనియ‌ర్ల క‌మెడియ‌న్ బోర్ కొట్టేయ‌డంతో యంగ్ క‌మెడియ‌న్ అయిన మన సప్తగిరికి….అవ‌కాశాలు వరుసగా వ‌చ్చాయి.

ఇంకా చెప్పాలి అంటే…మన స‌ప్త‌గిరి టాలీవుడ్‌లో చిన్న సినిమాల‌కు స్టార్ క‌మెడియ‌న్ అయిపోయాడు. డిమాండ్ బాగా పెరిగిపోవ‌డంతో ఒకప్పుడు సినిమా లెక్కలో తీసుకున్న ఈ యువ కమీడియన్…ఇప్పుడు ప‌ర్ డేగా డిసైడ్ చేశాడ‌ట‌. అయితే ఆ పర్ డే లెక్క ఎంతో తెలుసా….దాదాపుగా స‌ప్త‌గిరి రోజుకు ల‌క్ష నుంచి ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కూ తీసుకుంటున్నాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌. మ‌రీ చిన్న సినిమాలు అయితే రూ.ల‌క్ష‌….కాస్త పెద్ద సినిమాలు అయితే రూ.ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కు వ‌సూలు చేస్తున్నాడ‌ట‌. అంతేలే…అవకాశాలు వస్తున్నప్పుడే వసూలు చేసుకోవాలి…లేదంటే…కష్టమే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus