మనవడి రాకతో సంతోషవనమైంది : బ్రహ్మనందం

  • April 13, 2017 / 11:50 AM IST

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తాత అయ్యారు. ఆయన తనయుడు గౌతమ్‌, జోత్స్న దంపతులకు మగబిడ్డ పుట్టాడు. హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో మంగళవారం జోత్స్న బాబుకి జన్మనిచ్చింది. హనుమాన్‌ జయంతి రోజున మా ఇంట్లో మరింత ఆనందం వెల్లివిరిసింది. నా మనవడి రాకతో మా ఇల్లు కళకళలాడతోందని బ్రహ్మానందం తన ఆనందాన్ని కుటుంబసభ్యులు, బంధువులతో పంచుకున్నారు. జ్యోత్స్న , బాబు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని బ్రహ్మానందం తెలిపారు. అలాగే గౌతమం తండ్రిగామారడం ఆనందంగా ఉందన్నారు.

‘పల్లకిలో పెళ్లి కూతురు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్‌, ‘బసంతి’తో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ‘మను’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఫణీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. కొడుకు పుట్టిన సందర్భాన్ని కుటుంబ సభ్యులతో కలిసి గౌతమ్‌ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus