బాలీవుడ్, శాండల్ వుడ్ లలో డ్రగ్స్ వ్యవహారం పెద్ద దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ అయిన రియా చక్రవర్తి, అలాగే సంజన గల్రాని, రాగిణి ద్వివేది వంటి వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. ఎన్.సి.బి(నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో) ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఇదిలా ఉండగా.. ఎవ్వరూ ఊహించని విధంగా నిన్న ప్రముఖ బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ఇంట్లో బెంగుళూర్ పోలీసులు సోదాలు నిర్వహించారు.
డ్రగ్స్ కేసులో వివేక్ బంధువు అయిన ఆదిత్య అల్వా ను కూడా నిందితుడుగా గుర్తించి..అతను వివేక్ ఇంట్లో ఉన్నాడు అనే సమాచారం అందడంతో పోలీసులు ఈ సోదాలు నిర్వహించినట్టు తెలుస్తుంది. అయితే అతని ఆచూకీ లభించకపోవడంతో.. వివేక్ ఒబెరాయ్ భార్య ప్రియాంకకు నోటీసులు పంపారని తెలుస్తుంది. కర్ణాటక మాజీ మంత్రి, దివంగత జీవరాజ్ అల్వా కొడుకు ఆదిత్య అల్వా… వివేక్ ఒబెరాయ్ భార్య ప్రియాంక సోదరుడన్న సంగతి తెలిసిందే. ఆమె సోదరుడికి సంబంధించిన వివరాలను సేకరించడం కోసమే ప్రియాంకకు బెంగుళూర్ పోలీసులు నోటీసులు పంపినట్టు తెలుస్తుంది.
అయితే ఈ విషయం పై వివేక్ సీరియస్ అయ్యారట. ‘సంబంధంలేని విషయాలకు తన భార్యను పోలీస్ విచారణకు పిలవడం ఏమిటి’ అని అతను తన లాయర్ ను సంప్రదిస్తున్నట్టు సమాచారం.
Most Recommended Video
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!