Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

విశ్వక్ సేన్ నటించిన ‘కల్ట్'(Cult) సినిమా ఈ శుక్రవారం భారీ పోటీలో రిలీజ్ అవుతుంది. సాధారణంగా విశ్వక్ సేన్ తన సినిమాల పబ్లిసిటీ విషయంలో రాజీపడడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో రిలీజ్ కి ముందు మంచి బజ్ క్రియేట్ చేసుకోవడం అతనికి అలవాటు. కానీ ‘కల్ట్’ సినిమాకి మాత్రం అలాంటి హడావిడి ఏమీ కనిపించడం లేదు. ‘లైలా’ సినిమాని సైతం ఓ రేంజ్లో ప్రమోట్ చేసుకున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’ విషయంలో పెద్ద కేర్ తీసుకున్నట్టు కనిపించడం లేదు.

Cult

ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి అయితే ఈ సినిమా అక్టోబర్ 30న రిలీజ్ అవుతుంది అనే సంగతి కూడా తెలీదు అంటే అతిశయోక్తి అనిపించుకోదు. ఈ వారం ఆడియన్స్ కి ఫస్ట్ ఆప్షన్ ‘ఆదర్శ కుటుంబం’ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ సినిమా చూశాక వేరే సినిమాకి కూడా ఆడియన్ వెళ్ళాలి అనుకుంటే.. అది సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని ఉండాలి. అలాంటి మేజిక్ మౌత్ టాక్ తోనే సాధ్యమవ్వాలి.

ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘కల్ట్’ బిజినెస్ అలాగే ఓటీటీ వివరాల గురించి కొంత మేర చర్చలు జరుగుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘కల్ట్’ సినిమాకి రూ.25 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఇందులో ఓటీటీ(అమెజాన్ ప్రైమ్) రూపంలో రూ.6 కోట్లు వచ్చినట్టు వినికిడి. డబ్బింగ్ రైట్స్ అయితే ఇంకా సేల్ అవ్వలేదు. థియేటర్ నుండీ రూ.10 కోట్లు రావాలి. ఇలా చూసుకుంటే రికవరీ కేవలం రూ.16 కోట్లే. అంటే రూ.9 కోట్లు డెఫిసిట్ తో సినిమాని రిలీజ్ చేస్తున్నారు అనుకోవాలి.

స్ట్రాంగ్ మౌత్ టాక్ కనుక రాకపోతే.. ధియేట్రికల్ గా రికవరీ కావడం కూడా కష్టం. చూడాలి మరి ఫైనల్ గా ‘కల్ట్’ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో..!

రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus