‘ప్రభాస్ బాహుబలి’గా విడుదలవుతున్న ‘డార్లింగ్’..!

  • April 22, 2016 / 01:25 PM IST

కరుణాకర్ దర్శకత్వంలో ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘డార్లింగ్’. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు తమిళంలో ‘ప్రభాస్ బాహుబలి’ పేరుతో విడుదల కానుంది. తమిళంలో ప్రభాస్ కు పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోయినప్పటికీ.. తమిళంలో కూడా విడుదలైన బాహుబలి చిత్రంతో ప్రభాస్ కు మంచి క్రేజ్ ఏర్పడింది.

దాంతో ప్రముఖ తమిళ డిస్ట్రిబ్యూటర్ సంస్థ భద్రకాళి ఫిల్మ్స్ వారు ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో అనువదిస్తోంది. ఈ అనువాద చిత్రానికి జి‌వి ప్రకాష్ స్వరాలు సమకూరుస్తుండగా.. ఈ చిత్ర ఆడియోను ఇటీవలే విడుదల చేశారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus