ప్రభాస్, రానాల కోసం మంచి కథ సిద్ధంచేసిన డైరక్టర్

  • July 4, 2018 / 12:09 PM IST

ప్రభాస్, రానా .. ఈ కాంబినేషన్ ని దర్శకనిర్మాతలు ఊహించుకోవాలంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే.. బాహుబలి వంటి అద్భుతమైన కథని, బాహుబలి, భల్లాల దేవా క్యారెక్టర్స్ కి మించి పాత్రలను సృష్టించాలంటే డైరక్టర్ కి చాలా కష్టం. ఇక వీరిద్దరూ కలిసి నటించే సినిమా నిర్మించాలంటే 200 కోట్లకు పైనే బడ్జెట్ చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరే 200 కోట్ల బడ్జెట్ మూవీలు చేస్తున్నారు. ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న సాహో మూవీ బడ్జెట్ 200 కోట్లు దాటిపోయింది. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసమే 70 కోట్లు ఖర్చుపెట్టారంటే ప్రభాస్ రేంజ్ ఏపాటిదో అర్థంచేసుకోవచ్చు.

ఇక గుణశేఖర్ దర్శకత్వంలో రానా చేయబోతున్న హిరణ్య కశ్యప మూవీకి 180 కోట్లు పక్కన పెట్టారు సురేష్ బాబు. అందుకే వీరి కాంబినేషన్ జోలికి ఇప్పటి వరకు వెళ్ళడానికి సాహసించలేదు. కానీ ప్రభాస్ తో మిస్టర్ పెర్ ఫెక్ట్ వంటి పెర్ ఫెక్ట్ మూవీని చేసిన దశరథ్ మాత్రం ఓ అద్భుతమైన కథ రెడీ చేసారంట. ఫ్యామిలీ కథలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే అతను ఒక మల్టీ స్టారర్ మూవీ కోసం కథను సిద్ధం చేసుకున్నాడట. ఆ కథలోని ప్రధాన పాత్రల్లో ప్రభాస్ .. రానా అయితే కరెక్టుగా ఇమిడిపోతారని నమ్ముతున్నారు. అందుకే ఎలాగైనా వారిద్దరికీ కథ వినిపించి ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ కథ వారికి నచ్చినా సెట్స్ మీదకు వెళ్ళడానికి రెండేళ్లు పడుతుంది. అంతబిజీగా ఉన్నారు. ఏమో కథ నచ్చి ముందుగానే చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus