మీడియాకి స్పష్టం చేసిన డైరక్టర్ దశరధ్!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కథ తనదని రచయిత్రి శ్యామలారాణి దిల్ రాజుపై  ఫిర్యాదు చేయడంతో మాదాపూర్‌ పోలీసులు అతనిపై  సెక్షన్ 120ఏ, 415, 420 కాపీరైట్‌ యాక్ట్‌ కింద  దిల్‌రాజుపై కేసు నమోదుచేశారు. ఈ విషయం ఫిలిం నగర్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇది నిజమేనా? దిల్ రాజు ఇలా చేశారా? అని చిత్ర యూనిట్ ని ప్రశ్నించేవారు ఎక్కువయ్యారు. దీంతో చిత్ర డైరక్టర్ కాపీ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చారు. స్వయంగా రాసిన ఓ లేఖను సోషల్ మీడియాలో ఉంచారు. “మిస్టర్ పర్ఫెక్ట్” కాపీ కథ కాదని స్పష్టం చేశారు. “శ్యామలారాణి తన నవల ” నా మనసు నిన్ను కోరి ” ని 2010 ఆగస్టులో రిలీజ్ చేశారు. కానీ అంతకుముందే 2009 లో ఈ మూవీ కథను ” నవ్వుతూ ” అనే టైటిల్ తో రైటర్స్ యూనియన్ లో రిజిస్టర్ చేయించాము.

ఈ విషయాన్ని యూనియన్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ శ్యామలారాణికి తెలియజేశారు., అయినా ఆమె అర్థం చేసుకోలేదు” అని ఆనాటి సంగతిని ఆధారాలతో సహా వివరించారు. అంతేకాదు.. 2008 లోనే ఈ కథను హీరో ప్రభాస్ కి తాము చెప్పగా, అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని లేఖలో స్పష్టం చేశారు. ఇంతటితోనైనా ఈ వివాదం ముగుస్తుందని డైరక్టర్ ఆశిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus