Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Advertisement

‘బాహుబలి’ తో తెలుగు సినిమా స్థాయి పెరిగింది. అంతేకాదు నార్త్ లో సౌత్ సినిమాలపై నమ్మకం పెరిగేలా చేసింది. మరోవైపు ఓవర్సీస్ లో సౌత్ సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ఈ నేపధ్యంలో కొంచెం హైప్ ఉంటే చాలు మన సౌత్ సినిమాలు తొలిరోజు వంద కోట్ల గ్రాస్ ను అవలీలగా దాటేస్తున్నాయి. ఈ నేపధ్యంలో రూ.100 కోట్లకు(100 Crore Grossers) పైగా గ్రాస్ వసూళ్ళను సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

100 Crore Grossers

1) పుష్ప: ది రూల్(పుష్ప 2): ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప’ కి రెండో భాగంగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని రేంజ్‌లో ఊచకోత కోసి టాప్ 1 గా  నిలిచింది.మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ్యవ్యాప్తంగా ఏకంగా రూ.271 కోట్ల గ్రాస్ వసూళ్ళను కొల్లగొట్టింది.

2) ధురంధర్: ది రివెంజ్ (దురంధర్ 2): ‘దురంధర్’ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ‘దురంధర్ 2’ పై భారీ హైప్ ఏర్పడింది. అందుకు తగ్గట్టే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా రూ.236 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

3) ఆర్ ఆర్ ఆర్ : దర్శకధీరుడు రాజమౌళి.. రామ్ చరణ్, ఎన్టీఆర్..లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన టాలీవుడ్ మల్టీస్టారర్ క్రియేట్ చేసిన  సెన్సేషన్ అంతా ఇంతా కాదు.మొదటి రోజు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా రూ.219 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

4) బాహుబలి 2: ది కన్ క్లూజన్ (బాహుబలి 2) : ‘బాహుబలి 2’ తో ఇండియన్ సినిమా రేంజ్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు రాజమౌళి. ఈ మాస్టర్ పీస్ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 213 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

5) కల్కి 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ మూవీ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.175 కోట్ల గ్రాస్ వసూళ్ళను కొల్లగొట్టింది .

6) సలార్ : రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన ఈ హై వోల్టేజ్ యాక్షన్‌ ఎంటర్టైనర్ మూవీ  మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.156 కోట్ల గ్రాస్ వసూళ్ళను కొల్లగొట్టింది.

7) కూలీ : సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ , స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘కూలీ’ సినిమా భారీ హైప్ ను సొంతం చేసుకుంది. నాగార్జున ఈ సినిమాలో విలన్ గా చేసిన సంగతి తెలిసిందే. ఆమిర్ ఖాన్ కూడా చిన్న కేమియో రోల్ చేశాడు. మొదటి రోజు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.144 కోట్ల గ్రాస్ వసూళ్ళను కొల్లగొట్టింది.

8) ఓజి : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో రూపొందిన  స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజి’. మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.143 కోట్ల గ్రాస్ వసూళ్ళను కొల్లగొట్టింది.

9) దేవర : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘దేవర. ఈ సినిమా మొదటి రోజు  ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 141 కోట్ల వసూళ్ళను రాబట్టింది.

10) ఆదిపురుష్ : రామాయణ గాథ ఆధారంగా దర్శకుడు ఓం రౌత్… పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను శ్రీరాముడిగా పెట్టి తీసిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఈ చిత్రం 141 కోట్ల వసూళ్లను సాధించింది.

11) లియో : దళపతి విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో 2వ సినిమాగా ‘లియో’ అనే యాక్షన్ థ్రిల్లర్ రూపొందింది. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 140 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టి కోలీవుడ్‌లో సృష్టించింది.

12) కేజీఫ్ చాప్టర్ 2 : యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన ‘కె జీ ఎఫ్’ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. దానికి రెండో భాగంగా వచ్చిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 133 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

13) సాహో : ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘సాహో’. మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.128 కోట్ల గ్రాస్ వసూళ్ళను కొల్లగొట్టింది.

14) జవాన్ : కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘జవాన్’ సినిమా.. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ. 126 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

15) యానిమల్ : రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపొందిన రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీ ‘యానిమల్’. ఈ చిత్రం తొలిరోజు ఏకంగా రూ.114 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.

16) పెద్ది : రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ స్పొర్ట్స్ డ్రామా… తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.112 కోట్ల గ్రాస్ వసూళ్ళను కొల్లగొట్టింది.

17) పఠాన్ : షారుఖ్ ఖాన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా ‘పఠాన్’. మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.103 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

18) ది రాజా సాబ్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ అండ్ ఫాంటసీ మూవీ ‘ది రాజాసాబ్’. నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. మొదటి రోజు ఈ సినిమా ఏకంగా రూ.101 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

 

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus