DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • లోకేష్ క‌న‌గ‌రాజ్‌ (Hero)
  • వామికా గ‌బ్బి (Heroine)
  • సంజ‌నా కృష్ణ‌మూర్తి, క‌స్తూరి రాజా త‌దిత‌రులు (Cast)
  • అరుణ్ మాథేశ్వ‌ర‌న్‌ (Director)
  • క‌ళానిధి మార‌న్‌ (Producer)
  • అనిరుధ్‌ (Music)
  • ముఖేష్ జి (Cinematography)
  • ప్ర‌స‌న్న జీకే (Editor)
  • Release Date : 7th ఆగ‌స్ట్‌ 2026
  • స‌న్ పిక్చ‌ర్స్‌ (Banner)

ఖైదీ, విక్ర‌మ్ లాంటి ట్రెండ్‌సెట్ట‌ర్ సినిమాల‌తో కోలీవుడ్‌లో స్టార్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు లోకేష్ క‌న‌గ‌రాజ్‌ (Lokesh Kanagaraj). టాలీవుడ్‌లోనూ అత‌డికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. డీసీ (DC) మూవీతో లోకేష్ క‌న‌గ‌రాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వామికా గ‌బ్బి హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు అరుణ్ మాథేశ్వ‌ర‌న్ ద‌ర్శక‌త్వం వ‌హించాడు. అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీ శుక్ర‌వారం తెలుగుతో పాటు త‌మిళంలో ఒకే రోజు రిలీజైంది. యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీగా రూపొందిన ఈ మూవీ ఎలా ఉంది? హీరోగా ఈ సినిమాతో లోకేష్ క‌న‌గ‌రాజ్ హిట్టు కొట్టాడా? లేదా? అంటే..

DC Movie Review

క‌థ‌: స‌ర్కార్ పోలీస్ వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తుంటాడు. అత‌డి గ్యాంగ్‌లో దేవ‌దాస్ (Lokesh Kanagaraj) ఓ మెంబ‌ర్‌గా ఉంటాడు. ఎస్ఐని చంపిన దేవ‌దాస్ అత‌డి గ్యాంగ్ విజ‌య‌వాడ‌లోని ఓ బార్‌లో త‌ల‌దాచుకుంటారు. అక్క‌డ బార్‌ సింగ‌ర్ పార్వ‌తిని (సంజ‌నా కృష్ణ‌మూర్తి) చూసి దేవ‌దాస్ ప్రేమ‌లో ప‌డ‌తాడు. మ‌రోవైపు స‌ర్కార్‌, దేవ‌దాస్ తో పాటు వారి గ్యాంగ్ ప‌ట్టుకోవ‌డానికి భోజ్‌రాజ్ స్పెష‌ల్ ఆఫీస‌ర్‌గా నియ‌మితుడ‌వుతాడు. దేవ‌దాస్ ఆచూకీ క‌నిపెట్టిన భోజ‌రాజ్ బార్‌పై ఎటాక్ చేస్తాడు. ఈ ఎటాక్‌లో దేవ‌దాస్ క‌ళ్ల‌ముందే పార్వ‌తి చ‌నిపోతుంది. దేవ‌దాస్ పోలీసుల‌కు చిక్కుతాడు. అత‌డిని ఎన్‌కౌంట‌ర్ చేయాల‌ని అనుకుంటారు. కానీ దేవ‌దాస్ త‌ప్పించుకుంటాడు. అత‌డి లైఫ్‌లోకి వేశ్య‌గా ప‌నిచేసే చంద్ర (వామికా గ‌బ్బి) వ‌స్తుంది.

ప‌ద్దెనిమిదేళ్లు వేశ్య‌గా న‌ర‌కం అనుభ‌వించిన చంద్ర‌ను విముక్తురాలిని చేస్తాడు దేవ‌దాస్. ఆ త‌ర్వాత ఏమైంది? దేవ‌దాస్ కోసం చంద్ర కూడా గ‌న్ ప‌ట్టి పోలీసుల‌కు వ్య‌తిరేకంగా ఎలాంటి పోరాటం చేసింది? దేవ‌దాస్ గ్యాంగ్‌లోని అంద‌రిని భోజ‌రాజ్ ఎలా చంపాడు? త‌న వారి చావుల‌కు వ్య‌తిరేకంగా చంద్ర‌తో క‌లిసి భోజ‌రాజ్‌పై దేవ‌దాస్ ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడు? త‌న తండ్రిని క‌ల‌వాల‌నే దేవ‌దాస్ కోరిక నెర‌వేరిందా? అస‌లు దేవ‌దాస్ క్రిమిన‌ల్‌గా ఎలా మారాడు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

న‌టీన‌టుల ప‌నితీరు: ఇన్నాళ్లు డైరెక్ట‌ర్‌గా ఆడియెన్స్‌ను మెప్పించిన లోకేష్ క‌న‌గ‌రాజ్ డీసీతోనే ఫ‌స్ట్ టైమ్ హీరోగా కెమెరా ముందుకొచ్చాడు. డెబ్యూ మూవీతోనే యాక్ట‌ర్‌గా త‌నైన ముద్ర‌వేశాడు. త‌క్కువ డైలాగ్స్‌తో ఆద్యంతం సీరియ‌స్‌గా లోకేష్ క‌న‌క‌గ‌రాజ్‌ రోల్‌ను డిజైన్ చేసిన తీరు బాగుంది. క్యాజువ‌ల్‌గా అత‌డి న‌ట‌న సాగింది. ఫోర్స్‌డ్ యాక్టింగ్‌ ఫీలింగ్ ఎక్క‌డ క‌నిపించ‌లేదు. ఈ సినిమాకు న‌ట‌న ప‌రంగా వామికా గ‌బ్బి పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. వేశ్య‌గా పాత్ర‌లో ఇంటెన్స్ రోల్‌లో మెప్పించింది. వేశ్య‌వాటిక నుంచి బ‌య‌ట‌ప‌డే సీన్‌లో మొద‌టిసారి బ‌య‌టి ప్ర‌పంచాన్ని చూసే స‌న్నివేశంలో ఆమె న‌ట‌న సినిమాకు హైలైట్‌గా నిలిచింది.

పార్వ‌తిగా సంజ‌నా కృష్ణ‌మూర్తి గ్లామ‌ర‌స్‌గా క‌నిపించించింది. చూడ‌టానికి అచ్చం వామికా గ‌బ్బిలానే ఉంది. భోజ్‌రాజ్ పాత్ర‌ను హీరోకు ధీటుగా ఇంకాస్త ప‌వ‌ర్‌ఫుల్‌గా రాసుకుంటే బాగుండేది. హీరో గ్యాంగ్ మెంబ‌ర్స్ న‌ట‌న బాగుంది. హీరో తండ్రిగా క‌స్తూరి రాజా (ధ‌నుష్ తండ్రి)ది చిన్న పాత్రే అయినా క్లైమాక్స్‌లో త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరు: డీసీ కోసం సింపుల్ క‌థ‌ను ఎంచుకున్నాడు ద‌ర్శ‌కుడు అరుణ్ మాథేశ్వ‌ర‌న్‌. స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేశాడు. యాక్ష‌న్ క‌థ‌లోకి ల‌వ్‌స్టోరీని లింక్ చేసిన విధానం బాగుంది. డీసీ కోసం క‌మ‌ర్షియ‌ల్ రూల్స్‌ను కంప్లీట్‌గా ప‌క్క‌న‌పెట్టి నాయ‌కానాయిక‌ల ప్రేమ‌క‌థ‌ను వెరైటీగా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేశాడు. ఐ ల‌వ్ యూ, ప్రేమ అనే మాట‌లు వినిపించ‌వు. క‌నీసం ట‌చ్ కూడా చేసుకోకుండా వారి దేవ‌దాస్‌, చంద్ర బంధాన్ని స్క్రీన్‌పై చూపించాడు. అనిరుధ్ ఈ సినిమాకు మ‌రో హీరోగా నిలిచాడు. మ్యూజిక్ ప‌రంగా త‌న‌లోని కొత్త కోణాన్ని ఆవిష్క‌రించుకోవ‌డానికి అత‌డికి స్కోప్ దొరికింది. పోలీస్ స్టేష‌న్‌పై హీరోయిన్ ఎటాక్ చేసి హీరోను విడిపించే సీన్‌కు బీజీఎమ్‌గా క్లాసిక‌ల్ మ్యూజిక్ వినిపిస్తుంది. సినిమా మొత్తం ఇలాగే పొయెటిక్ స్టైల్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కంపోస్ చేశాడు. హై పిచ్‌గా సాగే బీట్ సౌండ్స్ సినిమాలో ఉండ‌వు. పాట‌లు రెండు ఉన్నా అవి కూడా మాంటేజ్ లోనే వినిపిస్తాయి.

ముఖేష్ సినిమాటోగ్ర‌ఫీ పీరియాడిక్ లుక్ తీసుకొచ్చింది. ప్ర‌స‌న్న ఎడిటింగ్ బాగుంది. క్రిస్పీ ర‌న్ టైమ్‌తో సినిమాను తెర‌కెక్కించారు. స‌న్ పిక్చ‌ర్స్‌లో ఉండే భారీ సెట్స్‌, క‌ళ్లుచెదిరే విజువ‌ల్స్ ఈ సినిమాలో క‌నిపించ‌వు. చాలా వ‌ర‌కు నాచుర‌ల్ లోకేష‌న్స్‌లోనే ఈ సినిమాను షూట్ చేసిన విధానం బాగుంది.

విశ్లేష‌ణ: లోకేష్ క‌న‌గ‌రాజ్ హీరో డెబ్యూ అన‌గానే అత‌డి స్టైల్ స్క్రీన్‌ప్లే, హీరోయిజం, ఎలివేష‌న్లు ఉంటాయ‌ని ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్‌చేస్తారు. కానీ త‌న క‌థ‌ల‌కు భిన్నంగా ఈ సినిమా చేశాడు. పోలీస్ వ్య‌వ‌స్థ‌లోనూ అవినీతిపై ఓ యువ‌కుడు సాగించిన పోరాటం చుట్టూ డీసీ సాగుతుంది. దేవ‌దాస్‌ జీవితంలోకి ఓ ఇద్ద‌రు అమ్మాయిలు ఎలా వ‌చ్చారు? అత‌డి ల‌క్ష్యానికిఓ వేశ్య‌ ఎలా అండ‌గా నిలిచింది? అన్న‌ది ఎమోష‌న‌ల్ క‌మ్ వ‌య‌లెంట్‌గా చూపించారు.

హీరోహీరోయిన్ల ల‌వ్‌ట్రాక్‌లో ఇంటిమేట్ సీన్లు, లిప్‌లాక్‌లు పెట్ట‌చ్చు. కానీ ద‌ర్శ‌కుడు వాటితో అవ‌స‌రం లేద‌ని అనుకున్నాడు. వేశ్యకు గ్యాంగ్‌స్ట‌ర్‌కు మ‌ధ్య ఉన్న స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌ను మాత్ర‌మే చూపించాడు. అన‌వ‌స‌ర‌పు ట్రాక్‌ల జోలికి పోకుండా తాను అనుకున్న క‌థ‌నుస్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేశాడు. కొడుకు గొప్ప‌త‌నాన్ని గురించి హీరో తండ్రి తెలుసుకునే ఎపిసోడ్‌ను క‌థ‌కు క‌నెక్ట్ చేసే సీన్‌ను ద‌ర్శ‌కుడు బాగా రాసుకున్నాడు.

క‌థ ప్రెడిక్ట‌బుల్‌గా సాగ‌డం, చాలా చోట్ల లాజిక్‌ల‌ను వ‌దిలేయ‌డం సినిమాకు మైన‌స్‌గా మారింది. హీరో అండ్ గ్యాంగ్ ద‌ర్జాగా సిటీలో తిరుగుతున్నా పోలీసుల‌కు చిక్క‌క‌పోవ‌డం, హీరోగా ఈజీగా జైలు నుంచి త‌ప్పించుకోవ‌డం లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది. సంజ‌నా కృష్ణ‌మూర్తి ఎపిసోడ్ బోరింగ్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా సింపుల్‌గానే ఎండ్ చేశారు. లిమిటెడ్ బ‌డ్జెట్‌లోనే ఈ సినిమాను చేయాల‌ని ఫిక్స‌యిన‌ట్లు ఉన్నారు. చాలా చోట్ల రాజీ ప‌డ్డ‌ట్టుగా ఈజీగా అర్థ‌మైపోయింది.

ఫోక‌స్ పాయింట్‌: ఓవ‌రాల్‌గా డీసీ రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఆడియెన్స్‌కు ఎక్క‌డం క‌ష్ట‌మే. వెరైటీ క‌థ‌ల‌ను ఇష్ట‌ప‌డే ఆడియెన్స్‌ను కొంత వ‌ర‌కు మెప్పిస్తుంది.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus