వాళ్ళిద్దరూ రొమాన్స్ చేయలేదు నమ్మండి!

  • November 9, 2017 / 06:58 AM IST

సినిమా రిలీజయ్యాక ఎంత విజయం సాధిస్తుంది? ఎందరి నోళ్లలో నానుతుంది? అనే ప్రశ్నలకు ప్రస్తుతం సరైన సమాధానం దొరకదు కానీ.. విడుదలకు ముందు మాత్రం ఇప్పటివరకూ ఏ బాలీవుడ్ సినిమాకీ లభించనంత స్థాయిలో పబ్లిసిటీ & క్రేజ్ ఏర్పడింది. అయితే.. అందుకు తోడ్పడింది మాత్రం అనవసరమైన పుకార్లు. ఆ పుకార్లు పబ్లిసిటీకి ఉపయోగపడితే పర్లేదు కానీ.. సినిమా ఆగిపోయే స్థాయికి వస్తే ఎవరు మాత్రం ఉరుకుంటారు చెప్పండి. అందుకే “పద్మావతి” డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రంగంలోకి దూకాడు.

దీపికా పదుకొణే, షాహిద్ కపూర్, రణవీర్ సింగ్ లు ముఖ్యపాత్రలో “పద్మావతి” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 1న విడుదల చేయాలని ప్రమోషన్స్ కూడా మొదలెట్టాక.. ఈ చిత్రంలో రాజ్ పూత్ లను తక్కువ చేసి చూపించారని, పద్మావతి పాత్ర పోషిస్తున్న దీపికా పదుకొణే మరియు ఖిల్జీ పాత్రలో పోషిస్తున్న రణవీర్ సింగ్ ల నడుమ రొమాన్స్ సీన్స్ ఉన్నాయని, అవి చరిత్రను నాశనం చేస్తాయని పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. దాంతో స్వయంగా సంజయ్ లీలా భన్సాలీ రంగంలోకి దిగి.. “అసలు రణవీర్-దీపికల నడుమ ఒక్క కాంబినేషన్ సీన్ కూడా లేదు, చరిత్రను ఏ విధంగానూ పక్కదోవ పట్టించలేదు, సినిమా చూసిన తర్వాత మీరే మెచ్చుకొంటారు” అంటూ ఓ వీడియోను యూట్యూబ్ లో వదిలాడు. భన్సాలీ వివరణతో కొంత మేరకు గొడవలు సర్ధుమణిగే అవకాశాలున్నా.. సినిమా రిలీజయ్యాక ఎలాంటి ఇష్యూస్ వస్తాయో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus