Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • హర్షిత్ రెడ్డి (Hero)
  • స్మేహ మణిమేఘాలై (Heroine)
  • నరేష్, ఝాన్సీ,బలగం వేణు, జీవన్, తదితరులు (Cast)
  • శ్రీకాంత్ సంగిశెట్టి (Director)
  • వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి (Producer)
  • ఈశ్వర్ చంద్ (Music)
  • వంశీ పచ్చిపులుసు (Cinematography)
  • హృషికేష్ పసపల్ (Editor)
  • Release Date : 20th జూన్ 2026
  • అర్హ మీడియా (Banner)

‘మెయిల్’ అనే ఓటీటీ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న హర్షిత్ రెడ్డి… తర్వాత ‘కల్కి 2898 AD’ ‘శుభం’ వంటి పెద్ద సినిమాల్లో కూడా నటించి మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. అతని లేటెస్ట్ మూవీ ‘దీవానా’ (Deewana) రిలీజ్ కి ముందు వార్తల్లో నిలిచింది. ఎందుకంటే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని.. ‘ఈ సినిమా చాలా బాగుంది’ అంటూ తెగ పొగిడేయడం వల్లనే అని చెప్పాలి..! మరి సినిమా నిజంగా అల్లు అరవింద్ చెప్పిన స్థాయిలో ఉందా? తెలుసుకుందాం రండి :

Deewana Movie Review

కథ: మున్నా(హర్షిత్ రెడ్డి) ఓల్డ్ సిటీలో నివసించే ఓ కుర్రాడు. డిగ్రీ కంప్లీట్ చేసినప్పటికీ ఉద్యోగం లేకపోవడంతో తన స్నేహితులను వెనకేసుకొని అల్లరి చిల్లరిగా తిరుగుతూ అక్కడి కుర్రాళ్ళతో గొడవలు పెట్టుకోవడం ఇతని దినచర్య. మున్నా ఎంత అల్లరి చిల్లరిగా తిరిగినా తండ్రి శేఖర్(నరేష్) మాత్రం ఒక్క మాట కూడా అనడు. పైగా కొడుకుని మరింత ప్రేమగా చూసుకుంటాడు. తల్లి(ఝాన్సీ) కూడా అంతే..! అయితే ఒకసారి అమూల్య అలియాస్ అమ్ముతో(స్మేహా మణిమేఘలై) తొలిచూపులోనే ప్రేమలో పడతాడు మున్నా. తర్వాత ఆమె ఆచూకీ కోసం గాలిస్తాడు. ఒకరోజు అనుకోకుండా కరెంట్ బిల్లు కట్టడానికి ఈ సేవాకి వెళ్లిన మున్నాకి అక్కడ అమూల్య కనిపిస్తుంది.

ఆమె గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అని.. అక్కడే పనిచేస్తుంది అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత తన ఏరియాలో ఉన్న జనాల కరెంట్ బిల్లులు సేకరించి.. అవి కట్టే వంకతో రోజూ అమ్ముని కలిసి ఆమెను విసిగిస్తూ ఉంటాడు. ఒకరోజు ఆమెకి తన ప్రేమ గురించి చెబితే.. ‘గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుని కనిపించు.. అప్పుడు ఆలోచిస్తాను’ అని చెబుతుంది? ఆ వెంటనే మున్నాని పోలీసులు అరెస్ట్ చేస్తారు? అది ఎందుకు? మున్నా అంటే చాలా ఇష్టం ఉన్నప్పటికీ అమూల్య ఎందుకు అతన్ని దూరం పెడుతుంది? అతన్ని ప్రాణంగా చూసుకునే తండ్రి ఎందుకు ఇంట్లో నుండీ మెదపట్టుకుని బయటకు తోసేస్తాడు? చివరికి మున్నా గవర్నమెంట్ జాబ్ కొట్టాడా? లేదా? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: హర్షిత్ రెడ్డి ఓల్డ్ సిటీ కుర్రాడిగా కరెక్ట్ గా సెట్ అయ్యాడు. మున్నా పాత్రలో అతను అన్ని రకాల ఎమోషన్స్ పలికించాడు. క్లైమాక్స్ లో కన్నీళ్ళు పెట్టించాడు అనే చెప్పాలి. హీరోయిన్ స్మేహ మణిమేఘలై పాత్ర చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ మధ్య కాలంలో హీరోయిన్లు కేవలం గ్లామర్ కే పరిమితమవుతున్నారు. కానీ ఈ సినిమాలో స్మేహ కళ్ళతోనే పలికించిన హావభావాలకి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు.

కచ్చితంగా ఆమెకు లాంగ్ కెరీర్ ఉండొచ్చు. సీనియర్ నరేష్ గురించి కొత్తగా చెప్పేది ఏముంది. అతను కనిపించే ప్రతి ఫ్రేమ్లో మిగతా ఆర్టిస్టులని డామినేట్ చేసేశాడు. తల్లి పాత్రలో ఝాన్సీ కూడా చాలా ఇన్వాల్వ్ అయిపోయి చేసింది. బలగం వేణు చేసింది చిన్న పాత్రే అయినా.. పోలీస్ స్టేషన్ సీన్లో అదరగొట్టేశాడు. అక్కడ అతను హీరోతో చెప్పే డైలాగులు కూడా ఇన్స్పిరేషన్ గా ఉంటాయి. మిగతా నటీనటులు ఓకే.

సాంకేతిక నిపుణుల పనితీరు: ‘దీవానా’ టీజర్, ట్రైలర్ చూసిన వాళ్ళకి ‘ఇది కొత్త కథ’ అనే ఫీలింగ్ ఏమాత్రం కలగదు. అల్లు అరవింద్ వంటి బడా నిర్మాత ఈ సినిమాని అంతలా ఎందుకు పొగిడేశారు? ‘కల్ట్ క్లాసిక్’ అనే రేంజ్లో ఎందుకు ప్రశంసించాడు? ఈ ప్రశ్నలతోనే రెగ్యులర్ సినిమా లవర్స్ థియేటర్ కి వెళ్లి కూర్చుంటారు. స్టార్టింగ్ ఎపిసోడ్స్ అన్నీ రెగ్యులర్ గానే ఉంటాయి. హీరో కరెంట్ బిల్లులు తీసుకుని ఈసేవాకి వెళ్లడంతోనే ఫస్ట్ హాఫ్ అంతా అయిపోతుందేమో అని అంతా ఫిక్సయిపోతారు. అలాంటి టైంలో ఒకే ఒక్క షాకింగ్ ఎలిమెంట్ తో అప్పటివరకు ఆడియన్ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నిటినీ పోగొట్టేస్తాడు దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి.

‘అక్కడి నుండీ కథనాన్ని ఎలా నడిపిస్తాడు?’ అనే క్యూరియాసిటీతో ఆడియన్ వచ్చి సీట్లో కూర్చుంటాడు. సీన్ సీన్ కి సినిమా గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. పోలీస్ స్టేషన్ సీన్ కావచ్చు, హీరో తల్లిదండ్రుల మధ్య వచ్చే సన్నివేశాలు కావచ్చు అన్నీ హృద్యంగా అనిపిస్తాయి. క్లైమాక్స్ ను కూడా దర్శకుడు బాగా డీల్ చేశాడు. కాకపోతే హీరో తల్లిదండ్రులతో హీరోయిన్ కి కాంబినేషన్ సీన్ ఒక్కటైనా పెట్టుండాల్సింది. పేరెంట్స్ ట్రాక్ ను అంత ఎమోషనల్ గా చూపించినప్పుడు.. ఆ ఒక్క సీన్ కూడా పెట్టుంటే కథకి, లవ్ ట్రాక్ కి నిండుతనం వచ్చేది. కానీ ఎందుకో దర్శకుడు ఆ స్టెప్ తీసుకోలేదు. డెబ్యూ మూవీ అయినప్పటికీ దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి ‘దీవానా’ ని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది.

రెగ్యులర్ లవ్ స్టోరీని హార్డ్ హిట్టింగ్ ఎలిమెంట్స్ తో చాలా హానెస్ట్ గా చెప్పాడు. అలా అని మైనస్సులు లేవు అనడానికి లేదు. మ్యూజిక్ బాగున్నప్పటికీ కొన్ని చోట్ల పాత సినిమాల్లోని ట్యూన్స్ వాడినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ వద్ద వచ్చే బీజీఎం ‘సీతా రామం’ సినిమాలోని ఇంటర్వెల్ సీన్ కి వాడిన బీజీఎంలా అనిపిస్తుంది. ఇలానే ఒకటి రెండు పాత సినిమాల్లోని ట్యూన్స్ గుర్తుకొస్తాయి. సినిమాటోగ్రఫీ కొన్ని చోట్ల పేలవంగా ఉంది. ముఖ్యంగా స్ట్రీట్ ఫైట్స్ సీక్వెన్స్ వచ్చినప్పుడు ఫోన్లో తీసేశారా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగ్గట్టు అనిపించినా.. ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుణ్ణు అనిపిస్తాయి.

విశ్లేషణ: ఈ వారం వచ్చిన సినిమాలన్నిటిలో ‘దీవానా’ ఓ సర్ప్రైజింగ్ ఫీల్ ఇస్తుంది. ఇదొక హానెస్ట్ అటెంప్ట్. అలా అని కేవలం ప్రేమకథ మాత్రమే అనడానికి లేదు. ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ బాగా కుదిరాయి. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ కోసం కచ్చితంగా ఈ సినిమాని థియేటర్లలో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే.

ఫోకస్ పాయింట్: హానెస్ట్ అండ్ హార్డ్ హిట్టింగ్ అటెంప్ట్

రేటింగ్: 2.75/5

 

Rating

2.75
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus