గ్రాఫిక్ వర్క్ కారణంగా మళ్ళీ వాయిదాపడిన ట్యాక్సీవాలా

  • June 4, 2018 / 01:21 PM IST

“అర్జున్ రెడ్డి” విడుదలై త్వరలో ఏడాది పూర్తైపోతుంది.. ఇప్పటివరకూ విజయ్ దేవరకొండ నటించిన మరో సినిమా విడుదలవ్వలేదు. “మహానటి”లో ముఖ్యపాత్ర పోషించినప్పటికీ.. ఆ సినిమాలో విజయ్ నటన విమర్శలపాలవ్వడం మినహా మనోడికి పెద్దగా ఉపయోగపడలేదు. పోనీ “ట్యాక్సీవాలా”గా వచ్చి తన స్టామినా ప్రూవ్ చేసుకొంటాడేమోనని ఎదురుచూస్తున్న విజయ్ అభిమానుల ఆశలు ఎప్పటికప్పుడు గల్లంతవుతూనే ఉన్నాయి. ఆల్రెడీ రెండుసార్లు పోస్ట్ పోన్ అయ్యి ఎట్టకేలకు జూన్ 14కి విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ.. గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పెండింగ్ లో ఉండడంతో వేరే దారి లేక సినిమాను జూలైకి పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలను కూడా రీషూట్ చేస్తున్నారట.

విజయ్ సరసన ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ దర్శకుడు.నిన్నమొన్నటివరకూ మెగా క్యాంప్ హీరోస్ కు పి.ఆర్.ఓ గా వ్యవహరించిన ఎస్.కె.ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా మారాడు. మరి ఇన్ని వాయిదాల తరువాత విడుదలవుతున్న “ట్యాక్సీవాలా” బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం హల్ చల్ చేస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus