ప్రపంచవ్యాప్తంగా దేవదాస్ ఫస్ట్ వీక్ కలక్షన్స్

  • October 4, 2018 / 01:54 PM IST

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కలిసి నటించిన దేవదాస్ సెప్టెంబర్ 27 న రిలీజ్ అయి మిశ్రమస్పందన అందుకుంది. శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ మూవీలో నాని, నాగ్ పోటీ పడి నవ్వించారు. అయితే కథలో కొత్తదనం లేకపోవడంతో ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ ఆ తర్వాత కలక్షన్స్ నానాటికీ పడిపోతున్నాయి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించిన ఈ మూవీ 37 కోట్లకు పైనే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మూవీ విడుదలై వారం అవుతున్నా 21 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అవ్వాలంటే మరో 15 కోట్లు రావాల్సి ఉంది. ఆ మొత్తాన్ని ఈవారం రాబడుతుందని ట్రేడ్ వర్గాలవారు అంచనా వేస్తున్నారు. దేవదాస్ తొలివారం ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలక్షన్స్ వివరాలు ఏరియాల వారీగా … కోట్లల్లో..

ఏరియా : కలక్షన్స్ (షేర్ )
నైజాం : 6.02
సీడెడ్ : 2.24
ఉత్తరాంధ్ర : 2.11 గుంటూరు : 1.41
కృష్ణ : 1.25
ఈస్ట్ గోదావరి : 1.10 వెస్ట్ గోదావరి : 0.85
నెల్లూరు : 0.57
ఇతర ప్రాంతాల్లో : 2.50 ఓవర్సీస్ : 3.25
ప్రపంచవ్యాప్తంగా : 21.30

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus