కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి దర్శకత్వంలో యువ హీరో విజయ్ దేవరకొండ చేసిన సినిమా అర్జున్ రెడ్డి సంచలనం సృష్టించింది. గత ఏడాది విడుదలయిన ఈ సినిమా సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీల అభినందనలు అందుకుంది. కలక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రాన్ని తమిళంలో, హిందీలో రీమేక్ చేయడానికి పోటీ పడి హక్కులను సొంతం చేసుకున్నారు. అంతేకాదు అర్జున్ రెడ్డిగా నటించడానికి ఎంతోమంది యువ హీరోలు ఆసక్తికనబరిచారు. అయితే తమిళంలో స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ఆ అవకాశాన్ని పట్టేసాడు. ఛాన్స్ దక్కిందని సంతోషపడుతూ ఉండిపోకుండా చమటను చిందించాడు.
దాదాపు ఆర్నెళ్లుగా ధృవ్ ఎంతగానో కష్టపడి మేకోవర్ సాధించాడు. తాజాగా ధృవ్ కొత్త లుక్‌ను విక్రమ్ తన అభిమానులతో పంచుకున్నాడు. “అర్జున్‌రెడ్డి” లుక్‌లో ధృవ్ అందరినీ తెగ నచ్చేసాడు. ఈ ఫోటోని చూసిన వారందరూ… విభిన్నమైన లుక్ కోసం కష్టపడడంలో తండ్రికి ఏమాత్రం తీసిపోడని ధృవ్‌ను అభినందిస్తున్నారు. సమాజంలో జరిగే సంఘటనలని కథలుగా తీసుకొని అత్యంత సహజంగా తెరకేకించే బాలా.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి తమిళంలో అర్జున్ రెడ్డి ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.