త్రివిక్రమ్, దేవీ శ్రీ ప్రసాద్ లు గొడవపడ్డారా?

  • November 9, 2017 / 07:56 AM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో మాదిరిగానే నిజ జీవితంలో షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడుతారు. తన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ తో సున్నితంగా మాట్లాడి తనకి కావాల్సింది రాబట్టుకోవడంలో నేర్పరి. ఇప్పటివరకు ఆయన ఎవరితోనూ గొడవపడినట్లు వార్తలు రాలేదు. కానీ తొలిసారిగా త్రివిక్రమ్, రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తో  గొడవ పడ్డారని ఫిలిం నగర్ లో గాసిప్ గుప్పుమంది. వీరిద్దరి కాంబినేషన్లో జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్‌ సత్యమూర్తి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. త్రివిక్రమ్ చిత్రం అంటే దేవీ కూడా చాలా శ్రద్ధతో ట్యూన్స్ ఇస్తారు. కానీ త్రివిక్రమ్  అ..ఆ.. సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ ని మార్చారు. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్‌ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు.

తరువాత పవన్‌ కళ్యాణ్‌ సినిమా అనగానే దేవీతోనే త్రివిక్రమ్‌ మ్యూజిక్‌ చేయిస్తారని అందరూ అనుకున్నారు. అలా జరగలేదు. అనిరుధ్ తో పని మొదలెట్టారు. ఈ కారణాల వల్ల త్రివిక్రమ్, దేవీ మధ్య దూరం పెరిగిందని చెప్పుకుంటున్నారు. పోనీ త్రివిక్రమ్‌ ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాకు అయినా దేవీని తీసుకుంటారంటే అదీ లేదు. అనిరుద్‌తోనే మ్యూజిక్‌ చేయిస్తున్నారు. దీంతో త్రివిక్రమ్, దేవీ శ్రీ ప్రసాద్ లు గొడవపడి ఉంటారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఇద్దరూ ఏమంటారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus