సాహో సినిమాలో ప్రభాస్ పాత్రపై భిన్న కథనాలు..!

  • March 10, 2018 / 07:21 AM IST

యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న (Movie Saaho)సాహో సినిమాలో సౌత్, నార్త్ సినీ పరిశ్రమల్లోని నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఏకకాలంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్, విలన్స్ గా బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే లు నటిస్తున్నారు. అంతేకాదు తమిళనటుడు అరుణ్ విజయ్, మల్లూవుడ్ సీనియర్ నటుడు”లాల్” కూడా సాహోలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అబుదాబిలో తెరకెక్కించడానికి సుజీత్ టీమ్ రెడీ అవుతోంది.

ప్రభాస్, నీల్ నితిన్ ముఖేష్ లు పాల్గొననున్న ఈ యాక్షన్ సీన్స్ ను మిషన్ ఇంపాజిబుల్ వంటి అనేక హిట్ సినిమాలకు పనిచేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో షూట్ చేయనున్నారు. అయితే ఇందులో ప్రభాస్ రోల్ గురించి టాలీవుడ్ లో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు చెప్పుకున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం. భారీ దొంగతనాలు చేసే ఓ వ్యక్తి పోలీస్ గూడాచారిగా మారుతాడని, అంతర్జాతీయ క్రిమినల్ ముఠాని పట్టుకుంటాడని తెలిసింది. వాళ్ళని పట్టుకునే సమయంలో భారీ ఛేజింగ్ ఉంటుందని టాక్. గాల్లో. నీళ్లల్లో కూడా భారీ ఫైట్స్, విన్యాసాలు ఉంటాయని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. జాతీయ స్థాయిలో మంచి పేరున్న బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus