‘ఎఫ్2’ డైరెక్టర్ కి భారీ గిఫ్ట్ ఇచ్చిన దిల్ రాజు..?

Advertisement

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరున్నప్పటికీ గతేడాది… దిల్ రాజుకి ఒక్క హిట్టు కూడా దక్కలేదు. ‘లవర్’ ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రాలు డిజాస్టర్లు కాగా… ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రం యావరేజ్ గా నిలిచింది. అయితే ఈ సంవత్సరం ఆరంభంలో ‘దిల్ రాజు’ నిర్మాణంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘ఎఫ్ 2’ చిత్రం మాత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పెట్టిన పెట్టుబడికి రెండింతలకు పైనే లాభం వచ్చింది దిల్ రాజుకి. గతేడాది 3 చిత్రాలతో వచ్చిన నష్టాల్ని ఈ చిత్రం తీర్చేసినా కూడా… ఇంకా ఎక్కువే మిగిలిందట.

అమెజాన్ ప్రైమ్ లో విదుదలయినా కూడా ఈ చిత్రం కలేక్షన్లకి బ్రేక్ పడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. మర్చి 2 కు ఈ చిత్రం విడుదలయ్యి 50 రోజులు పూర్తిచేసుకుంది. ఇక ఈ చిత్రానికి పని చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కు లేటెస్ట్ గా ఐ ఫోన్స్ ను గిఫ్ట్ లుగా ఇచ్చాడట దిల్ రాజు. ఇక మన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడికి అయితే ఏకంగా ‘బీఎం డబ్ల్యూ’ కారు గిఫ్ట్ గా ఇచ్చాడట. ఇక త్వరలో మహేష్ బాబు 26 వ చిత్రాన్ని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడట అనిల్ రావిపూడి. ఈ చిత్రానికి కూడా దిల్ రాజు నిర్మాత గా వ్యవహరిస్తుండడం విశేషం. మరి ఆ చిత్రం ఎలాంటి విజయాన్ని నమోదుచేస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus